E-Paper
Advertisement

సర్‌పై ముందే తేరుకున్న తెలంగాణ‌! ఓటుబ్యాంకు ర‌క్షించుకునే ప‌నిలో ప‌క‌డ్బందీ వ్యూహం!

సర్‌పై ముందే తేరుకున్న తెలంగాణ‌! ఓటుబ్యాంకు ర‌క్షించుకునే ప‌నిలో ప‌క‌డ్బందీ వ్యూహం!
Advertisement

ప్ర‌త్యేక ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ (స‌ర్)ను ఎదుర్కొనేందుకు టీపీసీసీ స‌ర్వం సిద్దం చేసుకుంటున్న‌ది. చెప్పేదొక‌టి, చేసేదొక‌టిలా ఉన్న ఓట‌ర్ల తొల‌గింపు ప్ర‌క్రియ ప‌ట్ల అప్ర‌త‌మ్తంగా ఉండాల‌ని గ‌త అనుభ‌వాలు చెబుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ‌ల‌ర్ట‌య్యింది. అటు ఏపీలో జ‌గ‌న్ కూడా దీనిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చినా.. తెలంగాణలో కాంగ్రెస్ అంత దూకుడు అక్క‌డ లేదు.

ఇక్క‌డ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, టీపీపీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌.. అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు రంగంలోకి దిగారు. తెలంగాణ‌లో బీజేపీ పాగా వేయాల‌నుకుంటున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్‌, బీహార్ త‌దిత‌ర చోట్ల ఈ స‌ర్ విధాన‌మే ఆ పార్టీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. అధికార ప‌క్షానికి ఓట‌మిని చ‌విచూప‌డంలో ఇది కీల‌క‌పాత్ర పోషించింద‌నే అంచ‌నాలున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ మొద‌టి నుంచి నిర‌స‌నగ‌ళ‌మిప్పుతున్నాడు. అయితే ఈ విధానం వ‌ల్ల బోగ‌స్ ఓట్ల ఏరివేత జ‌రుగుతుంద‌నే కార‌ణంగా న్యాయ‌స్థానాలు కూడా దీన్ని త‌ప్పుబ‌ట్ట‌డం లేదు. దీంతో మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో కేంద్రం తెలంగాణ‌లో స‌ర్‌ను ప్ర‌యోగించేందుకు సిద్దం కాగా.. అంతే దూకుడుగా కాంగ్రెస్ దీన్ని క్షేత్ర‌స్థాయిలో ఎదుర్కొనేందుకు సంసిద్ద‌మైంది.

Advertisement

బూత్ లెవ‌ల్ ఏజెంట్ల‌ను నియ‌మించుకోవ‌డం వారికి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో ఓ కీల‌క అంకం ముగిసింది. బీఎల్ఏలే ఇందులో కీల‌క భూమిక పోషించ‌నున్నారు. త‌మ ఓట‌ర్లెవ‌రు? ఇంటినెంబ‌ర్ల‌తో స‌హా.. ఇంటి పేర్ల‌తో స‌హా చాలా మందికి ఓట‌ర్లు ప‌రిచ‌యం ఉంటారు. దీంతో ఏదైనా కార‌ణం చేత ఓటు పెండింగ్‌లో పెడితే.. ఎందుకు పెట్టారో కార‌ణాలు తెలుసుకుని.. వారికి కావాల్సిన యా ప‌త్రాల‌ను స‌మ‌ర్పించేంద‌కు, ద‌ర‌ఖాస్తులు చేసేందుకు వారంతా సిద్దంగా ఉంటార‌న్న‌మాట‌. స‌ర్‌లో వ‌చ్చిన తంటా ఏంటంటే.. చివ‌ర వ‌ర‌కు ఆ ఓటును తొల‌గించామ‌ని చెప్ప‌దు.. లాస్ట్ జాబితా వ‌ర‌కు కూడా మీ ఓటు పెండింగ్‌లో ఉంద‌నే చెబుతుంది. దీంతో ఆ ఓటరుకు త‌గిన స‌మాచారం లేక‌పోవ‌డ‌మే, నిర్లిప్త‌తో కార‌ణ‌మేదైనా .. ఓటు వేసే స‌మ‌యానికి ఓటరు జాబితాలో పేరు గ‌ల్లంతై క‌నిపిస్తుంది.

దీంతో అప్పుడు ల‌బోదిబోమ‌ని మొత్తుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. గతంలో ఇతర రాష్ట్రాల్ల్ అదే జ‌రిగింది. కానీ అక్క‌డ సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు హ‌డావుడి ఓ నెల వ్య‌వ‌ధిలోనే అంతా కానిచ్చేశారు. కానీ ఇక్క‌డ స‌మ‌యం ఉంది. ఒక‌వేళ ఓటును పెండింగ్‌లో పెట్టినా.. దాని గ‌ల కార‌ణాలు వెతికి బ‌య‌ట‌కు తీసేందుకు కాంగ్రెస్ టీమ్ రెడీ అయ్యింది. ఎందుకంటే.. ఈ స‌ర్ విధానంతో ఎన్ని ఓట్లు తొల‌గిస్తే.. అంత కాంగ్రెస్‌కే నష్టం. దీని వ‌ల్ల బీజేపికి ఎంత లాభ‌మువుతుందో తెలియ‌దు కానీ.. అంతిమంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్‌కు మ‌ధ్యేమార్గంగా లాభం చేకూరే అవ‌కాశాలున్నాయి. దీంతో త‌న ప్ర‌ధాన శ‌త్రువు కాంగ్రెస్సే కాబ‌ట్టి…అది ఓడితే చాలు అనే భావ‌న‌కు వ‌స్తే.. తెలంగాణ‌లో గెల‌వ‌క‌పోయినా ప‌ర్వాలేదు.. కాంగ్రెస్ ఓడితే చాలు అనే వ్యూహాల‌కు కేంద్రం ప‌దును పెడితే.. అందుకే ఈ స‌ర్ ను అంత ఆశామాషీగా తీసుకోవ‌డం లేదు తెలంగాణ కాంగ్రెస్‌.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×