Galaxy Z Fold 4 Price Cut: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కానీ వీటి ధరలు సామాన్యులకు కాస్త భారంగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లో శాంసంగ్ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ Galaxy Z Fold 4పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం స్టాక్ చాలా పరిమితంగా ఉండటంతో కొనుగోలుదారులు ఈ డీల్ కోసం ఎగబడుతున్నారు.
భారత్‌లో లాంచ్ అయినప్పుడు Galaxy Z Fold 4 (12GB RAM, 256GB వేరియంట్) ధర రూ.1,54,999గా ఉండేది. కానీ ఇప్పుడు ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ఏకంగా రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే.. దాదాపు రూ.65,000 వరకు లాభం చేకూరుతోంది. అలాగే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా మరో రూ.41,050 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది.
Also Read: AI ఫీచర్లు, అమోలెడ్ డిస్‌ప్లే.. శాంసంగ్ కొత్త స్కెచ్.. Galaxy A27 5G లీకైన పూర్తి వివరాలివే!
ఈ ఫోల్డబుల్ ఫోన్ 2022లో వచ్చినప్పటికీ.. ఇప్పటికీ సరికొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. దీనిలో 6.2 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేతో పాటు, ఫోన్ తెరిచినప్పుడు ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ తరహా అనుభూతినిచ్చే 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ మెయిన్ డిస్‌ప్లే ఉంటుంది. రెండు స్క్రీన్లు కూడా 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం విశేషం.
ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్ వాడేటప్పుడు అస్సలు లాగ్ అవ్వదు. దీనికి తోడు 12GB RAM ఉండటంతో ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే ఇందులో 4400mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
ఇక ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 10MP కెమెరా ఇచ్చారు. 5G సపోర్ట్, వైఫై 6E, బ్లూటూత్ 5.2 వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫోల్డబుల్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం.
Also Read: ఏసీలు, కూలర్లు లేని ఆ కాలంలో.. 500 ఏళ్ల క్రితమే రాజుల కోటలు ఎలా చల్లగా ఉండేవో తెలుసా?