E-Paper
Advertisement

Bleeding: అద్భుతం.. గాయం ఎంత పెద్దదైనా, ఒక్క సెకన్‌లో బ్లీడింగ్ ఆపేసే స్ప్రే.. కొరియా సైంటిస్టుల ఘనత

Bleeding: అద్భుతం.. గాయం ఎంత పెద్దదైనా, ఒక్క సెకన్‌లో బ్లీడింగ్ ఆపేసే స్ప్రే.. కొరియా సైంటిస్టుల ఘనత
Advertisement

గాయాలైనప్పుడు రక్తం కారడం సహజమే. కానీ, దాన్ని వెంటనే నియంత్రించకపోతే ప్రాణాలకే ప్రమాదం. కొన్నిసార్లు గాయాలకు కట్టు కట్టినా.. బ్లీడింగ్ ఆగదు. రక్తం పోతూనే ఉంటుంది. వారిని కాపాడటం డాక్టర్ల వల్ల కూడా సాధ్యం కాదు. అందుకే, దక్షిణ కొరియా సైంటిస్టులు.. సంజీవని వంటి స్ప్రేను కనుగొన్నారు. దాన్ని ఉపయోగిస్తే.. సెకన్ల వ్యవధిలో బ్లీడింగ్ నిలిచిపోతుంది. బాధితుడి ప్రాణాలు కూడా నిలబడతాయి.

పౌడర్ లాంటి స్ప్రై

ప్రమాదాల జరిగినప్పుడు.. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడం చాలా ముఖ్యం. రక్తం పోకుండా కట్టుకడితే.. హాస్పిటల్‌కు ప్రాణాలతో తీసుకొని వెళ్లవచ్చు. కానీ, చాలా కేసుల్లో అది సాధ్యం కాదు. ఎన్ని కట్లు వేసిన రక్తం కారిపోతూనే ఉంటుంది. ఆ బ్లీడింగును ఆపేందుకు కొరియన్ సైంటిస్టులు పౌడర్ లాంటి స్ప్రేను కనుగొన్నారు. గాయమైన చోట దీన్ని స్ప్రే చేస్తే వెంటనే బ్లీడింగ్ ఆగిపోతుంది. ఆ పౌడర్ క్రమేనా గాయాన్ని కవర్ చేస్తూ గట్టి జెల్‌‌గా మారిపోతుంది. ఈ జెల్ ఒక సీల్‌లా పనిచేస్తుంది. రక్తాన్ని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటుంది.

అంబులెన్సుల్లో ఇది ఉండాల్సిందే..

Advertisement

ఎమర్జెన్సీ కేసుల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఇలాంటి స్ప్రే ప్రతి అంబులెన్సులో ఉండాల్సిందే. తీవ్రమైన గాయాలను కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ స్ప్రేకు ఉందట. పెద్ద పెద్ద ప్రమాదాల్లో బాధితులు ఎక్కువగా రక్తాన్ని కోల్పోతుంటారు. ముఖ్యంగా యుద్ధాలు, విపత్తులు, రోడ్డు ప్రమాదాల్లో గాయలైతే బ్లీడింగ్ కంట్రోల్ చేయలేం. బ్యాండేజీలు చుట్టినా సరే.. రక్తం కట్టడి కాదు. అలాంటి సమయంలో ఈ స్ప్రేని ఉపయోగిస్తే.. బ్లీడింగ్‌ను త్వరగా ఆపవచ్చు. ఈ స్ప్రే గానీ అందుబాటులోకి వచ్చినట్లయితే.. నిత్యం ఎన్నో మరణాలను ఆపవచ్చు.

ఈ స్ప్రేతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఈ స్ప్రేలో ఉపయోగించే పౌడర్‌ను సహజమైన పదార్థాలతోనే తయారు చేశారట. అయితే, అందులో ఏం వాడారనేది స్పష్టంగా చెప్పలేదు. అయితే, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు. ఈ పౌడర్‌లో ఉపయోగించిన పదార్థాలు రక్తాన్ని తాకగానే జెల్‌గా మారి గడ్డకట్టేస్తాయట. దీంతో రక్తం బయటకు వెళ్లే దారే దొరకదు. కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పౌడర్ నిలవకుండా జారిపోయే అవకాశాలుంటాయి. కానీ, ఈ జెల్ అలా కాదు.. బయటకు వచ్చిన రక్తంతో కలిసి కట్ అయిన ప్రాంతం వరకు గడ్డ కడుతుంది. దానివల్ల బ్లడ్ బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. పరిశోధనల్లో ఇది ఏ మాత్రం ప్రమాదకరం కాదని తేలింది. అంతేకాదు.. ఇది స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్ కూడా. గాయాలు కూడా చాలా వేగంగా మానుతాయి. కొత్త కణజాలం, రక్త నాళాలు మెరుగయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఈ స్ప్రే రెండేళ్ల వరకు పనిచేస్తుంది.

ఈ పౌడర్‌ను కనుగొన్నది ఎవరు?

Advertisement

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ KAIST‌కు చెందిన స్టెవే పార్క్, సంగ్యోంగ్ జాన్ ఈ పౌడర్‌ను కనుగొన్నారు. సైనికులకు ఈ స్ప్రే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డిజాస్టర్ రెస్క్యూ టీమ్, అంబులెన్స్‌ల్లో తప్పక ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది. ఇళ్లు, స్కూళ్లు, ఆఫీసుల్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కూడా ఉంటే మరింత మంచిది. అయితే, ఈ స్ప్రే ఇంకా వాడుకలోకి రాలేదు. ఇప్పటివరకు జంతువుల మీదే ప్రయోగించారు. అది సక్సెస్ అయ్యింది కూడా. మనుషులపై ప్రయోగించేందుకు ఇంకా హెల్త్ అథారిటీస్ నుంచి అనుమతులు రావాలి. అన్నీ సక్రమంగా సాగితే.. త్వరలోనే ఈ ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది.

Also Read: ఏంటీ బ్రో.. సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతున్నారా? SMAS వస్తోంది జాగ్రత్త!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×