E-Paper
Advertisement

MLA Yasaswini Reddy: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టే.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కీలక వ్యాఖ్యలు!

MLA Yasaswini Reddy: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టే.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కీలక వ్యాఖ్యలు!
Advertisement

MLA Yasaswini Reddy: పాలకుర్తి, స్వేచ్ఛ : బీఆర్ఎస్ పార్టీ పదిహేనేళ్ల పాలనలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని, ఆ పార్టీ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ప్రజలు నిలిచిపోయారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి (Yasaswini Reddy) తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్‌‌కు ఓటేస్తే మురికి కాలువలో ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే బోగస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో సుమారు 15 వేల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పట్టణ వీధులన్నీ కాంగ్రెస్ జెండాలతో కిటకిటలాడాయి. అనంతరం హరిపిరాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

తొర్రూరు పట్టణాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా

ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వం 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్నా తొర్రూరు పట్టణానికి కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన చరిత్ర బిఆర్ఎస్‌దేనని, ఇప్పుడు మళ్లీ అదే అబద్ధాలతో ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదమని మండిపడ్డారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. తొర్రూరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్ వంటి కీలక మౌలిక సదుపాయాలు త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలోనే ప్రజా పాలన సాధ్యమవుతుందని, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తుచేశారు.

Advertisement

Also Read: GHMC Council: నేటితో ముగియనున్న కౌన్సిల్ పదవీ కాలం.. నెలలోనే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు?

10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆరోగ్యశ్రీ పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. గతంలో ఐదు లక్షల రూపాయల వరకే పరిమితమైన ఆరోగ్యశ్రీని ప్రస్తుతం 10 లక్షల రూపాయలకు పెంచామని వెల్లడించారు. అలాగే సన్నబియ్యం పంపిణీ, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అనేక రకాల ప్రోత్సాహకాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేస్తోందని తెలిపారు. ప్రమాదవశాత్తు గ్రూపులో ఉన్న మహిళ ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని, అంతేకాక రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా అమలు చేస్తున్నామని వివరించారు.

16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం 

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు పొలాల కాడ కట్టుకోవడానికి, రోడ్డు పక్కన వాడుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడలేదని యశస్విని రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజల సంక్షేమం పేరుతో బీఆర్ఎస్ చేసింది కేవలం ప్రచారమేనని, వాస్తవంలో ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి… ప్రజలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించి అభివృద్ధికి బాట వేయాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతాయని స్పష్టం చేశారు. తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ గాలి స్పష్టంగా కనిపిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అభ్యర్థులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.

Also Read: Collector BM Santhosh: శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ సంతోష్!

Tags

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×