E-Paper
Advertisement

AC tips: వేసవి మొదలైపోయింది.. ఏసీ ఆన్ చేయడానికి ముందు ఈ 5 పనులు తప్పకుండా చేయాలి

AC tips: వేసవి మొదలైపోయింది.. ఏసీ ఆన్ చేయడానికి ముందు ఈ 5 పనులు తప్పకుండా చేయాలి
Advertisement

వేసవి కాలం మొదలవుతుండటంతో ఇళ్లలో ఎయిర్ కండిషనర్ వాడడం మొదలుపెట్టేస్తారు. చలికాలం మొత్తం ACను ఆఫ్‌లో ఉంచి వేసవిలో ఒక్కసారిగా ఆన్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూలింగ్ సరిగా లేకపోవడం, దుర్వాసన రావడం, విద్యుత్ బిల్లు పెరగడం, ఏసీ త్వరగా పాడవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దుకే వేసవి ప్రారంభానికి ముందు ACను ఆన్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి.

ఫిల్టర్ శుభ్రం చేయాలి
మొదటగా AC ఫిల్టర్ శుభ్రం చేయడం ముఖ్యమైన పని. ఫిల్టర్ ACలో గాలి శుభ్రతకు ప్రధాన భాగం. నెలల పాటు AC వాడకపోతే ఫిల్టర్‌పై దుమ్ము, మురికి పేరుకుపోతాయి. అలాంటి పరిస్థితిలో AC ఆన్ చేస్తే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. ఫలితంగా కూలింగ్ తక్కువగా ఉంటుంది. అలాగే దుమ్ముతో కూడిన గాలి గదిలోకి రావడం వల్ల అలర్జీలు, శ్వాస సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఫిల్టర్‌ను తీసి నీటితో శుభ్రం చేయడం లేదా అవసరమైతే కొత్త ఫిల్టర్ మార్చడం మంచిది.

Advertisement

ఎలక్ట్రికల్ కనెక్షన్లు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. AC కూడా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లాగే వైర్లు, ప్లగ్‌లు, స్విచ్‌లు, స్టెబిలైజర్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీర్ఘకాలం వాడకపోతే వైర్లు లూజ్ కావడం లేదా దెబ్బతినడం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో నేరుగా AC ఆన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ జరగవచ్చు లేదా ఏసీ పాడవ్వచ్చు. అందుకే AC ఆన్ చేసే ముందు కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవడం అవసరం.

Also read: worst Country: ఈ దేశంలో టీవీ చూసే స్వేచ్ఛ కూడా లేదు, టీవీ రిమోట్ ప్రభుత్వ నిఘాలోనే

Advertisement

అవుట్ డోర్ యూనిట్ పరిశుభ్రంగా
తరువాత అవుట్‌డోర్ యూనిట్ శుభ్రం చేయాలి. చాలామంది ఇండోర్ యూనిట్‌ను మాత్రమే చూసుకుంటారు కానీ బయట ఉండే అవుట్‌డోర్ యూనిట్ కూడా చాలా కీలకం. ఇది వేడిని బయటకు పంపే పని చేస్తుంది. అవుట్‌డోర్ యూనిట్‌పై ఆకులు, దుమ్ము, చెత్త పేరుకుపోతే వేడి బయటకు వెళ్లడం కష్టమవుతుంది. దీంతో AC కూలింగ్ పనితీరు తగ్గుతుంది. కాబట్టి అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ ఉన్న చెత్తను తొలగించి గాలి సులభంగా వెళ్లేలా చూడాలి.

AC చక్కగా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ACను వెంటనే ఎక్కువ సేపు నడపకుండా మొదట కొద్దిసేపు ఆన్ చేసి పరీక్షించడం మంచిది. గాలి బాగా వస్తుందా, వింత శబ్దం వస్తోందా? నీటి లీకేజీ జరుగుతుందా వంటి అంశాలను గమనించాలి. ఈ చిన్న పరీక్ష ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. సమస్య ఉంటే వెంటనే సర్వీస్ చేయించుకోవడం వల్ల పెద్ద నష్టం తప్పుతుంది.

పూర్తి సర్వీసింగ్
ఎందుకైనా మంచిది పూర్తి సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. ఏడాది పాటు వాడిన ACలో కాయిల్స్, డ్రెయిన్ పైపులు, ఫ్యాన్, గ్యాస్ స్థాయి వంటి భాగాల్లో లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించుకుంటే ఈ భాగాలన్నీ పూర్తిగా చెక్ చేస్తారు. దీంతో AC పనితీరు మెరుగవుతుంది. విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే యంత్రం ఎక్కువ కాలం పనిచేస్తుంది.

ఈ ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. AC త్వరగా చల్లగా చేస్తుంది. విద్యుత్ బిల్లు తగ్గుతుంది. మరమ్మత్తుల ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా కూడా మంచి గాలి లభిస్తుంది. వేసవిలో AC ఎక్కువగా వాడే కుటుంబాలకు ఇవి చాలా ఉపయోగకరమైన సూచనలు. వేసవి ప్రారంభానికి ముందు ACను నేరుగా ఆన్ చేయడం కన్నా చిన్నచిన్న చెకింగ్ లు చేయడం ఎంతో అవసరం. ఫిల్టర్ శుభ్రం చేయడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు చూడడం, అవుట్‌డోర్ యూనిట్ శుభ్రపరచడం, పనితీరు పరీక్షించడం, పూర్తి సర్వీసింగ్ చేయించడం వంటి ఐదు పనులు చేస్తే AC పనితీరు మెరుగవుతుంది.

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×