E-Paper
Advertisement

Kodiguddu Munakkaya Pulusu: వారానికి ఒక్కసారైనా వండాల్సిందే.. అంత రుచిగా ఉండే కోడిగుడ్డు మునక్కాయ పులుసు!

Kodiguddu Munakkaya Pulusu: వారానికి ఒక్కసారైనా వండాల్సిందే.. అంత రుచిగా ఉండే కోడిగుడ్డు మునక్కాయ పులుసు!

Kodiguddu Munakkaya Pulusu: కోడిగుడ్లతో ఏదైనా డిఫ్రెంట్‌గా కూర చేసుకోవాలి అనిపించినప్పుడు.. ఈ ‘కోడిగుడ్డు మునక్కాయ పులుసు’ను ఒకసారి ట్రే చేసి చూడండి. ఘాటైన మసాలా ముద్ద, పుల్లని చింతపండు రసంలో మునక్కాయలు ఉడుకుతుంటే వచ్చే ఆ సువాసన ఆకలిని రెట్టింపు చేస్తుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని, కోడిగుడ్డు పులుసు కలుపుకుని తింటే.. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడీ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం రండి..

కావలసిన పదార్థాలు:

మునక్కాయలు – నాలుగు
కోడి గుడ్లు – ఐదు
ఉల్లిపాయలు – మూడు
చింత పండు – 20 గ్రాములు
అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు
కరివేపాకు – రెండు రెబ్బలు
ఉప్పు – తగినంత
ఎండు మిరపకాయలు – రెండు
జీలకర్ర – అర టీ స్పూను
నూనె – సరిపడా
కొత్తిమీర – ఒక కట్ట
ఆవాలు – కొద్దిగా

Read Also: వంట రాని వారు కూడా అదరగొట్టేలా.. సింపుల్ అండ్ స్పైసీ చేపల ఇగురు!

తయారు చేసుకునే విధానం:

ముందుగా కోడి గుడ్లను ఉడికించి పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి. మునక్కాయల పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చింతపండును ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి, ఉడికించిన గుడ్లను వేసి ఎర్రగా వేయించి పక్కకు తీసుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాక, సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. దీనిలో మునక్కాయ ముక్కలు, వేయించిన కోడిగుడ్లు కూడా వేసి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి.

ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుండి ఒక గ్లాసు నీళ్లు పోసి తీసిన గుజ్జును కూరలో పోసి, మరో 10 నిమిషాలు ఉడికించాలి. మునక్కాయ ముక్కలు మెత్తగా ఉడికి పులుసు దగ్గరపడ్డాక, సన్నగా తరిగిన కొత్తిమీర తురుము వేసి దించేస్తే సరి.

Also Read: ఇంట్లో కూరగాయలు లేవా? అయితే ఈ స్పైసీ టమాటో పులావ్ చేసుకోండి, టేస్ట్ మామూలుగా ఉండదు!

Related News

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

Big Stories

×