E-Paper
Advertisement

టీవీ అంటే ఇలా ఉండాలి.. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అదరగొడుతున్న TCL మినీ LED టీవీలు!

టీవీ అంటే ఇలా ఉండాలి.. 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అదరగొడుతున్న TCL మినీ LED టీవీలు!
Advertisement

TCL C8L Mini LED TV: ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవాళ్ల సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ టీవీ ఉంటోంది. దీనికి తోడు ప్రముఖ కంపెనీలు కూడా వివిధ ఆఫర్ల రూపంలో బిగ్ స్క్రీన్ టీవీలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. అయితే కొందరు కేవలం పెద్ద స్క్రీన్ ఉంటే సరిపోదు, బొమ్మ క్లారిటీగా ఉండాలి, సౌండ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే TCL కంపెనీ ‘TCL C8L Mini LED TV’ టీవీని మార్కెట్లోకి తెస్తోంది. యూరోప్‌లో C8L పేరుతో, అమెరికాలో QM8L పేరుతో లాంచ్ అయిన ఈ 2026 మోడల్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

పిక్చర్ క్లారిటీ మామూలుగా లేదు:

ఈ టీవీలో వాడిన SQD మినీ LED టెక్నాలజీ వల్ల పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. మనం సాధారణంగా చూసే టీవీల కంటే దీనిలో రంగులు చాలా నేచురల్‌గా, కళ్లకు ఇంపుగా కనిపిస్తాయి. దీనికి తోడు సూపర్ క్వాంటం డాట్ టెక్నాలజీని కూడా జోడించారు. ఇక బ్రైట్‌నెస్ విషయానికి వస్తే.. 85, 98 ఇంచుల పెద్ద మోడల్స్ ఏకంగా 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇస్తాయి. దీంతో పగలు కిటికీల నుండి వెలుతురు నేరుగా టీవీపై పడినా సరే, స్క్రీన్ మీద బొమ్మ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నలుపు రంగులు కూడా చాలా థిక్‌గా ఉండి, సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ ఇస్తాయి.

Advertisement

Also Read: 13,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ఐప్యాడ్‌కు చుక్కలు చూపిస్తున్న Vivo Pad 6 Pro!

స్లిమ్ బాడీ.. అదిరిపోయే సౌండ్:

ఈ టీవీ చూస్తుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కేవలం 5 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉండటం వల్ల గోడకు తగిలిస్తే ఒక ఫ్రేమ్ లాగా ఒదిగిపోతుంది. బోర్డర్స్ కూడా దాదాపు లేనట్టే ఉంటాయి కాబట్టి.. మనకు స్క్రీన్ ఒక్కటే కనిపిస్తుంది. ఇక ఆడియో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫేమస్ బ్యాంగ్ అండ్ ఓలుఫ్సెన్ కంపెనీ వాళ్లు ఈ టీవీ సౌండ్ సిస్టమ్‌ను డిజైన్ చేశారు. దీనివల్ల మనం ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నా, ఏదో పెద్ద థియేటర్లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది.

గేమర్లు ఫుల్ ఖుషీ:

Advertisement

వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఈ టీవీ బాగా నచ్చేస్తుంది. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి.. దానిని 288Hz వరకు పెంచుకునే ఛాన్స్ కూడా ఉంది. దీంతో గేమ్స్ ఆడుతున్నప్పుడు బొమ్మ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా కదులుతుంది. అలాగే ఇందులోని AI ప్రాసెసర్ మనం చూస్తున్న దృశ్యానికి తగ్గట్టుగా కలర్స్ ని, వెలుతురుని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఈ C8L సిరీస్‌తో పాటు TCL కంపెనీ X11L, C7L లాంటి మరికొన్ని మోడళ్లను కూడా మార్కెట్లోకి తెచ్చింది. మొత్తానికి టీవీ చూసే అనుభవాన్ని మార్చేయడానికి TCL గట్టిగానే ప్లాన్ చేసింది. అయితే.. ఈ టీవీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Also Read: గేమర్స్‌కు పూనకాలే.. లోపలే కూలింగ్ ఫ్యాన్, 8,000mAh భారీ బ్యాటరీతో ‘OPPO K15 Pro’ సిరీస్ లాంచ్!

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×