Vivo Pad 6 Pro: ఈ టెక్ యుగంలో స్మార్ట్‌ఫోన్లతో పాటు ట్యాబ్లెట్‌ల హవా కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆఫీస్ పనులకైనా, సినిమాలు చూడటానికైనా చాలామంది ఇప్పుడు పెద్ద స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్‌లనే ఇష్టపడుతున్నారు. అందుకే వివో కంపెనీ తమ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ట్యాబ్లెట్ ‘Vivo Pad 6 Pro’ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. మొన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2026)లో ఈ ట్యాబ్లెట్‌ను చూపించి అందరినీ ఊరించిన వివో.. ఇప్పుడు దీని ధరలు, ఫీచర్ల వివరాలను అఫీషియల్‌గా బయటపెట్టింది.
ఈ ట్యాబ్లెట్ ఏకంగా 13.2 అంగుళాల 4K స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సాధారణంగా మనం వాడే ట్యాబ్లెట్ కంటే ఇది చాలా పెద్దది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడుతున్నా, బ్రౌజింగ్ చేస్తున్నా స్క్రీన్ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే కలర్ క్వాలిటీ కూడా అదిరిపోయేలా ఉంటుంది. దీనిలో పర్పుల్, బ్లూ, గ్రే వంటి సూపర్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
Also Read: ఆరేళ్ల బ్యాటరీ వారంటీతో Honor X80i లాంచ్.. 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా పగలదు!
వివో ఈ ట్యాబ్లెట్‌లో లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడింది. దీంతో ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా, భారీ గేమ్స్ ఆడినా ఇది అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్ ఉండటం వల్ల కొత్త ఫీచర్లు కూడా చాలా వస్తాయి. అలాగే 16GB వరకు RAM, 512GB స్టోరేజ్ ఉండటం వల్ల ఎన్ని ఫొటోలు, వీడియోలు దాచుకున్నా మెమరీ నిండిపోతుందన్న భయం అక్కర్లేదు.
చాలామందికి ట్యాబ్లెట్ కొనే ముందు ఉండే భయం.. బ్యాటరీ త్వరగా అయిపోతుందేమో అని. కానీ ఈ వివో ట్యాబ్లెట్‌లో ఏకంగా 13,000mAh బ్యాటరీని అమర్చింది. దీనిని ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే చాలా సేపు బ్యాకప్ వస్తుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా సరే.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి కొన్ని నిమిషాల్లోనే ఛార్జింగ్ ఎక్కుతుంది.
ఈ Vivo Pad 6 Proను మన దేశానికి వచ్చేసరికి స్టార్టింగ్ ధర రూ.61,600 నుంచి మొదలవుతోంది. టాప్ మోడల్ ధర రూ.91,800 వరకు ఉంటుంది. వెనుక 13MP కెమెరా, సెల్ఫీల కోసం 8MP కెమెరా ఇచ్చారు. దీంతో ఆఫీస్ పనులు చేసుకోవాలనుకుంటే దీనికి విడిగా కీబోర్డ్, స్టైలస్ పెన్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పటికే ఈ ట్యాబ్లెట్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Also Read: గేమర్స్‌కు పూనకాలే.. లోపలే కూలింగ్ ఫ్యాన్, 8,000mAh భారీ బ్యాటరీతో ‘OPPO K15 Pro’ సిరీస్ లాంచ్!