E-Paper
Advertisement

గేమర్స్‌కు పూనకాలే.. లోపలే కూలింగ్ ఫ్యాన్, 8,000mAh భారీ బ్యాటరీతో ‘OPPO K15 Pro’ సిరీస్ లాంచ్!

గేమర్స్‌కు పూనకాలే.. లోపలే కూలింగ్ ఫ్యాన్, 8,000mAh భారీ బ్యాటరీతో ‘OPPO K15 Pro’ సిరీస్ లాంచ్!
Advertisement

OPPO K15 Pro: ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనంతో వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రముఖ ఒప్పో సంస్థ సరికొత్త ఫోన్లను మార్కెట్లో దించుతుంటుంది. ఈసారి గేమర్ల కోసం చైనా మార్కెట్లో OPPO K15 Pro, K15 Pro Plus మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. గతేడాది వచ్చిన K13 టర్బో ఫోన్లకు ఇవి కొనసాగింపు అన్నమాట. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఉండటమే కాకుండా.. ఫోన్ వేడెక్కకుండా లోపలే చిన్న కూలింగ్ ఫ్యాన్‌ను కూడా పెట్టడం ఇప్పుడు టెక్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. చూడటానికి ఈ ఫోన్లు సైబర్‌పంక్ స్టైల్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి.

డిస్‌ప్లే అదిరిపోయింది..

చూడటానికి ఈ రెండు ఫోన్లు దాదాపు ఒకేలా ఉన్నా.. లోపల ఫీచర్లు మాత్రం కొంచెం మారుతాయి. K15 Pro+ మోడల్‌లో 6.78 అంగుళాల భారీ అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి 165Hz రిఫ్రెష్ రేట్ తోడవ్వడంతో గేమ్స్ ఆడేటప్పుడు బొమ్మ కళ్ల ముందు కదులుతున్నట్టు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక మామూలు K15 Pro లో 6.59 అంగుళాల స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రొ ప్లస్ మోడల్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇది ఫింగర్‌ ప్రింట్‌ను చాలా వేగంగా గుర్తు పడుతుంది. ఇక వర్షంలో తడిచినా, దుమ్ములో పడినా ఏమీ కాకుండా వీటికి IP69 రేటింగ్ ఇవ్వడం విశేషం.

Advertisement

Also Read: గూగుల్ నుంచి సరికొత్త ‘ఫిట్‌బిట్’ బ్యాండ్.. హూప్‌కు గట్టి పోటీ తప్పదా?

హీటెక్కుండా కూలింగ్ ఫ్యాన్..

ఈసారి ఒప్పో పూర్తిగా మీడియాటెక్ చిప్‌సెట్లపైనే నమ్మకం పెట్టింది. K15 Pro+ లో డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను వాడారు. ఇది ఎంతటి భారీ గేమ్స్‌నైనా అలవోకగా ఆడిస్తుంది. అలాగే K15 Pro లో కొత్తగా సూపర్ బ్రాండింగ్‌తో వచ్చిన డైమెన్సిటీ 8500 చిప్‌సెట్ ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ త్వరగా వేడెక్కుతుందనే బాధ ఉండకూడదని.. ఒప్పో ఈ ఫోన్లలో పెద్ద వేపర్ ఛాంబర్‌తో పాటు ఒక చిన్న కూలింగ్ ఫ్యాన్‌ను కూడా అమర్చింది. దీనివల్ల గంటల తరబడి గేమ్స్ ఆడినా ఫోన్ చల్లగానే ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్ అదుర్స్..

Advertisement

బ్యాటరీ విషయంలో మాత్రం ఒప్పో నిజంగానే రికార్డులు తిరగరాసింది. K15 Pro+ లో ఏకంగా 8,000mAh బ్యాటరీని ప్యాక్ చేశారు. సాధారణంగా మనకు 5,000mAh చూసి అలవాటు. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువే. ఇక ప్రో మోడల్‌లో 7,500mAh బ్యాటరీ ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఛార్జింగ్ కోసం ఎక్కువ టైమ్ వేస్ట్ అవ్వకుండా 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించారు. ఇకపోతే 50MP మెయిన్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరాతో మంచి ఫొటోలు తీయొచ్చు.

ధర వివరాలు..

చైనాలో OPPO K15 Pro బేస్ వేరియంట్ ధర రూ.41,000గా ఉంది. ఇక హైఎండ్ మోడల్ అయిన OPPO K15 Pro+ ధర రూ.47,000 నుంచి మొదలవుతోంది. ఈ ఫోన్లు చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా.. గోల్డెన్ లెజెండ్ అనే స్పెషల్ కలర్ వేరియంట్ కేవలం ప్రో మోడల్‌లో మాత్రమే దొరుకుతుంది. ఆండ్రాయిడ్ 16 సాఫ్ట్‌వేర్‌తో వస్తున్న ఈ ఫోన్లు త్వరలోనే ఇండియాకు కూడా వస్తాయని టెక్ లవర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఆ లుక్ ఏంది సామీ.. వీగన్ లెదర్, భారీ బ్యాటరీతో ‘Redmi Note 15 SE 5G’ భారత్‌లో లాంచ్!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×