TCL Nxtpaper 70 Pro| ఎలెక్ట్రానిక్స్ పాపులర్ కంపెనీ TCL కంపెనీ CES 2026 టెక్ ఎక్స్‌పో ఈవెంట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ TCL Nxtpaper 70 Proను పరిచయం చేసింది. ఈ ఫోన్ కళ్లకు హాయి ఇచ్చే డిస్‌ప్లే, ఫ్లెక్సిబుల్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై దృష్టి పెట్టింది. ఇందులో TCL లేటెస్ట్ Nxtpaper 4.0 డిస్‌ప్లే టెక్నాలజీ ఉంది. ఒక ప్రత్యేక ఫిజికల్ బటన్‌తో డిస్‌ప్లే మోడ్‌లను త్వరగా మార్చవచ్చు. స్టూడెంట్స్, ఎక్కువగా రీడింగ్ చేసేవారు, ప్రొఫెషనల్స్, రోజువారీ యూజర్ల కోసం ఈ ఫోన్ రూపొందించారు. కళ్ల సంరక్షణ ఫీచర్లతో పాటు మంచి పనితీరు హార్డ్‌వేర్ ఉంది.
ఎన్ఎక్స్‌టి పేపర్ 70 Proలో అడ్వాన్స్‌డ్ Nxtpaper 4.0 డిస్‌ప్లే టెక్నాలజీ ఉంది. ఎక్కువసేపు ఉపయోగించినా కళ్లకు ఇబ్బంది ఉండదు. TÜV, SGS సర్టిఫికేషన్లు కళ్ల సంరక్షణకు గుర్తుగా ఉన్నాయి. ఏడు ముఖ్యమైన ఐ-కేర్ టెక్నాలజీలు ఉన్నాయి. DC డిమ్మింగ్‌తో ఫ్లికర్ జీరో అవుతుంది. బ్లూ లైట్ ప్యూరిఫికేషన్ హానికరమైన కాంతిని తగ్గిస్తుంది. యాంటీ-గ్లేర్ ఫీచర్ ప్రకాశవంతమైన ప్రదేశాల్లో మంచి వ్యూయింగ్ ఇస్తుంది. సర్కాడియన్ కంఫర్ట్ మోడ్ నేచురల్ నిద్రకు సహాయపడుతుంది.
ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ Nxtpaper కీ. ఇది ఒక ఫిజికల్ బటన్. దీంతో డిస్‌ప్లే మోడ్‌లను వెంటనే మార్చవచ్చు. కలర్ పేపర్ మోడ్ సాధారణ స్మార్ట్‌ఫోన్ ఉపయోగానికి బెస్ట్. ఇంక్ పేపర్ మోడ్ ఆన్ చేయగానే డిస్‌ప్లే పేపర్ లాంటి రీడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మాక్స్ ఇంక్ మోడ్ స్క్రీన్‌ను పూర్తిగా మోనోక్రోమ్ చేస్తుంది. ఈ మోడ్‌లో ఏడు రోజుల రీడింగ్ టైమ్, 26 రోజుల స్టాండ్‌బై టైమ్ వస్తుందని TCL చెబుతోంది.
మాక్స్ ఇంక్ మోడ్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ రీడింగ్ టూల్స్ ఉన్నాయి. బిల్ట్-ఇన్ బుక్ లైబ్రరీ లభిస్తుంది. AI ఫీచర్లు రీడింగ్‌ను మెరుగుపరుస్తాయి. AI అవుట్‌లైన్, AI Q&A వంటివి ఉన్నాయి. AI ఆడియోబుక్, AI పాడ్‌కాస్ట్ ఫీచర్లు అందరికీ సులభంగా అందుతాయి. లెర్నింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు బాగా ఉపయోగపడతాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB ర్యామ్తో మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది. 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 5,200mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. IP68 రేటింగ్‌తో ధూళి, నీటి నుంచి రక్షణ ఉంది.
TCL Nxtpaper 70 Proలో 50MP రియర్ కెమెరా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో స్టెడీ షాట్స్ వస్తాయి. 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బెస్ట్. TCL మ్యూజ్‌ఫిల్మ్ టెక్నాలజీ, సూపర్ నైట్ విజన్, హారిజాన్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ OIS, EISతో వీడియో క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంది.
Also Read: మినీ టివి స్క్రీన్‌తో ఇంట్లో గాడ్జెట్స్ కంట్రోల్, వీడియో కాలింగ్.. కొత్త స్మార్ట్ డిస్‌ప్లే లాంచ్
ఫోన్‌తో అడ్జస్టబుల్ స్టాండ్ కేస్ వస్తుంది. ఆప్షనల్ T-Pen స్టైలస్ సపోర్ట్ ఉంది. నోట్ తీసుకోవడం, క్రియేటివ్ పనులకు సహాయపడతాయి. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌కు మంచి ప్రొడక్టివిటీ ఇస్తాయి.
256GB వేరియంట్ ధర యూరో 339. 512GB వేరియంట్ యూరో 389. ఫిబ్రవరి 2026 నుంచి లాంచ్ అవుతుంది. యూరప్, ఆసియా-పసిఫిక్, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో లభిస్తుంది. ఈ ఫోన్ రెండు కలర్స్ నెబ్యులర్ గోల్డ్, స్టెల్లార్ బ్లూలో లభిస్తుంది.