E-Paper
Advertisement

Tirumala News: శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల జారీ, మార్పు వెనుక..

Tirumala  News:  శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల జారీ, మార్పు వెనుక..
Advertisement

Tirumala News: తిరుమల పేరు చెబితే నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయినా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్వామి దర్శనం టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా దానిపై సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి?

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక

Advertisement

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన. శ్రీవాణి టికెట్ల జారీలో ఆఫ్‌లైన్ వ్యవస్థని రద్దు చేసింది టీటీడీ. ఆఫ్‌ లైన్ విధానంలో ప్రతీ రోజూ భక్తులకు 800 శ్రీవాణి దర్సనం టికెట్లను కేటాయిస్తోంది. జనవరి 9 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అమల్లోకి రానుంది. ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.

ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలని సూచన చేసింది. తిరుమలలో ప్రస్తుతం ఆఫ్‌లైన్ ద్వారా ప్రతీ రోజు 800 దర్శనం టికెట్లను జారీ చేస్తోంది టీటీడీ. ఆఫ్ లైన్ పద్దతిని జనవరి 9 నుంచి రోజు వారి కరెంట్ బుకింగ్‌లోకి మారుతోందిజనవరి 9వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవాణి దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Advertisement

శుక్రవారం నుంచి శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ

శ్రీవాణి దర్శనం టికెట్ పొందిన భ‌క్తులు.. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. దీనికితోటు మరో సూచన చేసింది టీటీడీ. కుటుంబంలో కేవలం న‌లుగురు సభ్యులకు మాత్రమే శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి అనుమతి ఉంటుంది.

అంతేకాదు టికెట్ల బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్‌తో పాటు మొబైల్ నెంబర్ వివరాలను తప్పనిసరి చేసింది టీటీడీ. అలాగే మొదట వచ్చినవారికి మొదట ప్రాతిపదికన దర్శనం టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అమల్లోకి వచ్చింది. తొలుత ఈ పద్దతిని నెలరోజుల పాటు పరిశీలించాలని ఆలోచన చేస్తోది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు వేచి చూడాల్సిన అవసరం లేదు.

ALSO READ:  వేగం పెంచిన కూటమి సర్కార్..  అడ్డంకులు తొలగిస్తూ అమరావతి పరుగులు

ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో ప్రతిరోజూ 500 శ్రీవాణి దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఏర్పాటు చేస్తున్న కొత్త విధానంపై మూడు నెలల తర్వాత సమీక్షిస్తామని తెలిపింది. దీనికితోడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఆఫ్‌లైన్ విధానం కొనసాగుతోంది. ప్రతిరోజూ 200 శ్రీవాణి దర్శనం టికెట్లు అక్కడ జారీ చేస్తున్నారు. ఈ విధానం యథాతథంగా కొనసాగుతోంది.

అన్నివ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామని, దయచేసి గ‌మ‌నించి భ‌క్తులు ద‌ర్శ‌నం కోసం తమ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.  కొద్దిరోజుల కిందట శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై తిరుమలలో పెద్ద రచ్చ సాగింది. రాత్రి నుంచి లైన్ లో ఉన్నా, మాకు టికెట్లు లభించలేదని పలువురు భక్తులు వాపోయారు. ఈ విషయంలో టీటీడీ సిబ్బంది చేతివాతం ప్రదర్శించినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. జరిగిన పరిణామాలను గమనించిన టీటీడీ, కొత్త విధానానికి శ్రీకారం చుట్టుందని చెబుతున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×