E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ప్రీమియం స్మార్ట్ టీవీ.. ఫీచర్లు మామూలుగా ఉండవు మరి..

బడ్జెట్ ధరలో ప్రీమియం స్మార్ట్ టీవీ.. ఫీచర్లు మామూలుగా ఉండవు మరి..
Advertisement

TCL QLED TV: ప్రముఖ బ్రాండ్ TCL, భారతీయ మార్కెట్లోకి తమ సరికొత్త 2026 మోడల్ ‘TCL T6D QLED’ సిరీస్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లను ఆశించే వారి కోసం వచ్చిన ఈ టీవీ అదిరి పోయే ఫీచర్లతో మన ముందుకు వచ్చింది.

Read also-Illu Illalu Pillalu Today Episodes: సాగర్ పై రెచ్చిపోయిన నర్మదా.. ఇదేం ట్విస్ట్ స్వామి.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

ఫీచర్లు

Advertisement

ఈ టీవీ మెటల్ బాడీతో, స్క్రీన్ చుట్టూ చాలా సన్నని బెజెల్స్‌తో అత్యంత ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఇది 43 ఇంచుల నుండి 85 ఇంచుల వరకు వివిధ సైజులలో లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో 3 HDMI పోర్టులు, ఒక USB 3.0 పోర్ట్ అందించారు. దీనితో పాటు వచ్చే వాయిస్ అసిస్టెంట్ రిమోట్‌లో YouTube, Prime Video, Disney+ Hotstar వంటి పాపులర్ ఓటిటి యాప్స్ కోసం డెడికేటెడ్ షార్ట్‌కట్ బటన్స్ ఉన్నాయి.

పనితీరు

ఇది 4K QLED VA ప్యానెల్‌తో పనిచేస్తుంది. ఇందులో డాల్బీ విజన్, HDR 10+, మరియు MEMC సపోర్ట్ ఉంది. ప్రాక్టికల్ టెస్టింగ్‌లో ఇది 330 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను నమోదు చేసింది. కలర్స్ న్యూట్రల్‌గా చాలా బాగున్నాయి, అయితే స్క్రీన్ మధ్యలో ఉన్నంత బ్రైట్నెస్ మూలల్లో (Corners) లేదు. ముఖంపై వివరాలు షార్ప్‌గా ఉన్నప్పటికీ స్కిన్ టోన్స్ కొద్దిగా రెడ్డిష్‌గా కనిపిస్తాయి. చీకటి గదిలో బ్లాక్ లెవెల్స్ కాస్త గ్రే రంగులోకి మారుతాయి. ఆడియో పరంగా ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న 24W స్పీకర్లు ఉన్నప్పటికీ, బేస్ తక్కువగా ఉండటం వల్ల సౌండ్ క్వాలిటీ యావరేజ్‌గానే ఉంటుంది.

Advertisement

Read also-Podarillu Today Episode : చక్రీ మాటకు ప్రతాప్ మైండ్ బ్లాక్.. మహా గదిలోకి చక్రీ.. కన్నతల్లి కోసం కన్నా కన్నీళ్లు.. ఇదే ట్విస్ట్

హార్డ్‌వేర్ & సాఫ్ట్‌వేర్

ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ‘Google TV OS’ పై నడుస్తుంది. ఇందులో 2GB RAM, 16GB స్టోరేజ్, AiPQ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) చాలా స్మూత్‌గా ఉంది టీవీ 25-30 సెకన్లలో బూట్ అవుతుంది. TCL ఈ టీవీపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు (43 ఇంచ్ రూ.33,000, 55 ఇంచ్ రూ.42,000) కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయితే, రాబోయే ఆన్‌లైన్ సేల్స్ లేదా ఆఫర్లలో ధరలు తగ్గి.. 43 ఇంచ్ రూ.25,000 లోపు, అలాగే 55 ఇంచ్ రూ.35,000 బడ్జెట్‌లో లభిస్తే, ఇది ఒక బెస్ట్ బడ్జెట్ QLED టీవీ అవుతుంది.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×