E-Paper
Advertisement

బక్రీద్ పండగ వేళ.. మేక ధర రూ. 2.4 లక్షలు, మరొకటి రూ.1.8 లక్షలు, ఎక్కడో తెలుసా?

బక్రీద్ పండగ వేళ..  మేక ధర రూ. 2.4 లక్షలు, మరొకటి రూ.1.8 లక్షలు, ఎక్కడో తెలుసా?
Advertisement

Goat Market: బక్రీద్ పండుగ నేపథ్యంలో మేకలు, గొర్రెలకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. మేకల మండీల్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. పెరిగిన రవాణా ఖర్చులు, మేత ధరలు పెంపు నేపథ్యంలో ధరలు అమాంతంగా  పెరిగాయి. తాజాగా పాట్నాలోని మేకల మార్కెట్లో రెండు మేకలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటి ధర కూడా ఆ రేంజ్‌లో ఉంది. ఒకటి రూ.2.4 లక్షలు కాగా, మరొకటి రూ. 1.8 లక్షలు. ఇంతకీ వాటి గురించి డీటేల్ గా తెలుసుకుందాం.

బక్రీద్ పండగ వేళ ఆకాశాన్ని తాకిన మేకల ధరలు

Advertisement

బక్రీద్ పండుగ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు, రాష్ట్రాల రాజధానుల్లో మేకల మార్కెట్లో సందడి నెలకొంది. గడిచిన మూడు రోజుల్లో ఆయా మార్కెట్లో కోట్లలో వ్యాపారాలు సాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మేకలు, గొర్రెలు అమ్మకాలు సాగిస్తున్నారు. పెరుగుతున్న ఖర్చు నేపథ్యంలో ఈ ఏడాది మేకల ధరలు దాదాపు 20 శాతం నుండి 40 శాతం వరకు పెరిగాయి.

ప్రత్యేక జాతి మేకల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి కొందరు వెనుకాడడం లేదు. పాట్నాలోని మేకల మార్కెట్‌లో సల్మాన్-సుల్తాన్ అనే రెండు మేకలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సల్మాన్ పేరు గల రెండేళ్ల మేకకు భారీ ధర పలికింది. రూ. 2.4 లక్షల గల ఆ మేక అందరిని ఆకర్షిస్తోంది. మరొకటి 1.8 లక్షల రూపాయలు. ఈ సీజన్ మార్కెట్ అధిక విలువ కలిగిన పండుగ వ్యాపారానికి ఇవి ప్రదర్శన శాలలుగా మారాయి.

Advertisement

విపరీతంగా ఆకట్టుకున్న సల్మాన్-సుల్మాన్ పేరు గల మేకలు

దాదాపు రెండున్నర లక్షల విలువ కలిగిన సల్మాన్ పేరిట మేక ఎత్తు నాలుగు అడుగులు. 100 కేజీలకు పైగా బరువున్న ఆరా జిల్లా నుంచి పాట్నాకు తీసుకొచ్చాడు. ఆ మేక కేవలం ధాన్యాలు, ఆకుకూరలు, పోషకాహార వాటితో పెంచినట్లు చెప్పుకొచ్చాడు అమ్మకందారుడు.

మార్కెట్‌లో అత్యధిక మందిని ఆకర్షించే వాటిలో ఒకటిగా మారిపోయింది. ఇక పండుగ వ్యాపారంలో పాల్గొనడానికి ఉత్తర ప్రదేశ్‌లోని మౌ జిల్లా నుండి ఓ వ్యాపారి సుల్తాన్ పేరిట మరొక మేకను పాట్నా మార్కెట్ కు తెచ్చాడు. దాని ధర దాదాపు రూ. 1.8 లక్షల ధర నిర్ణయించాడు. పాట్నా మార్కెట్లో సల్మాన్-సుల్తాన్ జోడి కొనుగోలు దారులను విపరీతంగా కట్టుకుంటున్నాయి.

ALSO READ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్య చేతిలో కులగణన నివేదిక

కాస్త తగ్గించాలని చాలామంది వినియోగదారులు కోరినా సనేమిరా అంటున్నారు వ్యాపారులు. పాట్నా మార్కెట్‌లో మేకలు రూ. 15,000 నుండి రూ. 40 వేల మధ్య అధికంగా అమ్ముడైనట్టు అక్కడి వ్యాపారులు తెలిపారు. అత్యుత్తమ శ్రేణిగల ఈ రెండు మేకలు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలో ప్రజల దృష్టిని ఆకర్షించాయి.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×