E-Paper
Advertisement

Smart Audio Glasses: ఇక ఇయర్ ఫోన్స్ అవసరం లేదు మావా.. షియోమీ కొత్త గ్లాసెస్ వచ్చేశాయ్!

Smart Audio Glasses: ఇక ఇయర్ ఫోన్స్ అవసరం లేదు మావా.. షియోమీ కొత్త గ్లాసెస్ వచ్చేశాయ్!
Advertisement

Smart Audio Glasses: కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినా.. ఇంకా ఆ పాత ఇయర్‌ఫోన్స్‌తోనే కుస్తీ పడుతున్నారా? అయితే ఈ కొత్త షియోమీ స్మార్ట్ ఆడియో గ్లాసెస్‌పై ఓ లుక్కేయండి. ఇవి కేవలం స్టైలిష్ కళ్లద్దాలు మాత్రమే కాదు.. వీటిలోనే స్పీకర్లు ఇంకా నాలుగు మైక్రోఫోన్లు దాగి ఉన్నాయి. అంటే చెవిలో ఏమీ పెట్టుకోకుండానే హాయిగా పాటలు వినొచ్చు. వి కేవలం స్టైలిష్ కళ్లద్దాలు మాత్రమే కాదు.. వీటిలోనే స్పీకర్లు ఇంకా నాలుగు మైక్రోఫోన్లు దాగి ఉన్నాయి. అంటే చెవిలో ఏమీ పెట్టుకోకుండానే హాయిగా పాటలు వినొచ్చుదీంతోపాటు క్లియర్‌గా కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. చూడటానికి నార్మల్ గ్లాసెస్ లాగే ఉన్నా, దీని ఫీచర్లు మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే. అవేంటో ఈ కథనం ద్వారా క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కళ్లద్దాల నుంచే పాటలు:

ఈ రోజుల్లో టెక్నాలజీ అంటే మన అవసరాలను తీర్చడమే కాదు.. మన స్టైల్‌ని కూడా పెంచాలి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో షియోమీ తన కొత్త స్మార్ట్ ఆడియో గ్లాసెస్‌ని మార్కెట్లోకి తెచ్చింది. ఇవి చూడటానికి మనం రెగ్యులర్‌గా పెట్టుకునే కళ్లద్దాలాగే ఉంటాయి కానీ, వీటి లోపల ఒక చిన్నపాటి హోమ్ థియేటరే దాగి ఉంది. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే నొప్పి గానీ, చుట్టుపక్కల శబ్దాలు వినబడకపోవడం వంటి ఇబ్బందులు గానీ ఇందులో ఉండవు. ఇది ఫ్యూచర్ టెక్నాలజీకి ఒక చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు.

Advertisement

Also Read: తక్కువ ధరలో హై ఫీచర్స్.. 42dB నాయిస్ క్యాన్సిలేషన్‌తో రెడ్‌మీ బడ్స్ 8 లైట్ విడుదల!

అద్భుతమైన ఆడియో అనుభవం:

ఈ ఆడియో గ్లాసెస్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో స్పీకర్లు ఉన్నా కూడా అవి మన చెవి లోపల ఉండవు. ఫ్రేమ్ చివరన ఉండే ఓపెన్ ఇయర్ స్పీకర్ల ద్వారా శబ్దం నేరుగా మన చెవులకు చేరుతుంది. దీనివల్ల మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు మ్యూజిక్ వింటూనే పక్కన వచ్చే వాహనాల శబ్దాలను కూడా గమనించవచ్చు. ఇక కాల్స్ విషయానికి వస్తే.. ఈ గ్లాసెస్‌లో ఏకంగా నాలుగు మైక్రోఫోన్లు ఇచ్చారు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌‌లో వచ్చే డిస్టబెన్స్‌ని తగ్గించి, మన మాట అవతలి వారికి చాలా క్లియర్‌గా వినిపించేలా చేస్తాయి. గాలి ఎక్కువగా వీస్తున్నా కూడా మీ వాయిస్ క్వాలిటీ తగ్గకుండా ఉండటం దీని ప్రత్యేకత.

ప్రైవసీకి పెద్ద పీట:

Advertisement

మనలో చాలామందికి ఒక అనుమానం ఉండవచ్చు. మనం వినే పాటలు పక్కన ఉన్న వారికి వినిపిస్తాయేమో అని. కానీ షియోమీ దీనిలో యాంటీ లీకేజ్ టెక్నాలజీని వాడింది. దీంతో.. మనం వినే ఆడియో కేవలం మనకు మాత్రమే వినిపిస్తుందే తప్ప పక్కన కూర్చున్న వారికి అస్సలు వినిపించదు. అంతేకాదు.. ఈ గ్లాసెస్ మీద టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఫ్రేమ్‌ని అటు ఇటు స్వైప్ చేస్తే చాలు పాటలు మార్చవచ్చు లేదా వాల్యూమ్ పెంచుకోవచ్చు. దీని డిజైన్ కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా అస్సలు భారంగా అనిపించదు.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు:

ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. దాదాపు 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 7 గంటల టాక్ టైమ్ ఇస్తుంది. ఇక దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి ఐపి54 రేటింగ్ కూడా ఇచ్చారు. అంటే.. వర్షంలో చిన్నపాటి చినుకులు పడినా ఏమీ కాదు. ఈ ఆడియో గ్లాసెస్‌తో స్టైల్, సౌకర్యం, అద్భుతమైన టెక్నాలజీ కావాలనుకునే వారికి షియోమీ స్మార్ట్ ఆడియో గ్లాసెస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా భారత మార్కెట్లోకి ‘మోటరోలా సిగ్నేచర్’ వచ్చేస్తోంది!

 

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×