E-Paper
Advertisement

Tecno Pova Curve 2: టెక్నో సంచలనం.. 7,750mAh భారీ బ్యాటరీతో త్వరలో భారత్‌లోకి పోవా కర్వ్ 2!

Tecno Pova Curve 2: టెక్నో సంచలనం.. 7,750mAh భారీ బ్యాటరీతో త్వరలో భారత్‌లోకి పోవా కర్వ్ 2!
Advertisement

Tecno Pova Curve 2: భారతీయ మొబైల్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న ప్రముఖ Tecno సంస్థ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. గతేడాది విడుదల చేసిన Pova Curve 5Gకి కొనసాగింపుగా మరింత శక్తివంతమైన ఫీచర్లతో Tecno Pova Curve 2ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా విడుదలైన టీజర్లు చూస్తుంటే.. ఈ ఫోన్ మిడ్‌రేంజ్ విభాగంలో సరికొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది.

త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ..

టెక్నో ఇండియా తన అధికారిక X ఖాతా ద్వారా ఈ ఫోన్ త్వరలో భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ధృవీకరించింది. ఫోన్ డిజైన్‌‌ను ప్రతిబింబిస్తూ రెండర్‌ను విడుదల చేసింది. అయితే, కచ్చితమైన తేదీపై ఇంకా క్లారిటీ లేనప్పటికీ, ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Advertisement

Also Read: పవర్‌ఫుల్ బ్యాటరీ ఫోన్ కావాలా? అద్భుతమైన కెమెరా ఫోన్ కావాలా? ఏది బెస్టో ఇప్పుడు చూసేద్దాం!

కెమెరా సెటప్ ప్రత్యేకం..

పేరుకు తగ్గట్టుగానే ఈ ఫోన్ ప్రీమియం లుక్‌తో రాబోతోంది. దీని కర్వ్‌డ్ ఎడ్జ్ డిజైన్ కేవలం చూడటానికే కాదు.. చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గ్రిప్‌ను కూడా ఇస్తుంది. ఇక వెనుక భాగంలో ఉండే వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఫోన్‌కు మరింత స్టైలిష్ లుక్‌ను జోడిస్తోంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే.. ఇది మరింత స్లిమ్‌గా, మోడ్రన్‌గా ఉంటుందని టెక్ వర్గాల సమాచారం.

ఆండ్రాయిడ్ 16 ప్రాసెసర్..

Advertisement

స్పీడ్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటోంది టెక్నో పూవా కర్వ్ 2 ఫోన్. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను వాడినట్లు తెలుస్తోంది. దీంతో భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభం అవుతుంది. ఇక 12GB వరకు RAM వేరియంట్లు ఉండటంతో ఫోన్ ఏమాత్రం హ్యాంగ్ అవ్వదు. అలాగే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్న తొలి ఫోన్లలో ఇది కూడా ఒకటి. దీనికి తోడు 1080×2364 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన హై క్వాలిటీ స్క్రీన్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

బ్యాటరీ సామర్థ్యంలో కొత్త రికార్డ్..

ఈ ఫోన్ ఏకంగా 7,750mAh భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఇతర ఫోన్లలో ఉండే బ్యాటరీ కంటే ఇది చాలా పెద్దది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం రెండు మూడు రోజులపాటు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. ఎక్కువగా లాంగ్ జర్నీలు చేసే వారికి, ఛార్జింగ్ సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

Also Read: శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫీచర్లు లీక్.. కెమెరా, బ్యాటరీ, కీలక వివరాలు మీ కోసం!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×