E-Paper
Advertisement

Indian Post: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. కేవలం మార్కుల మెరిట్‌తోనే 28,740 ‘డాక్ సేవక్’ ఉద్యోగాలు

Indian Post: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. కేవలం మార్కుల మెరిట్‌తోనే 28,740 ‘డాక్ సేవక్’ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ తీపి కబురు అందించింది. వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి జనవరి-2026 షెడ్యూల్ కింద నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం.

విద్యార్హతల వివరాలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా అభ్యర్థులు పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్ మరియు స్థానిక భాషను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు తెలుగు భాషపై పట్టు ఉండటం అవసరం. అకడమిక్ అర్హతలతో పాటు, అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయస్సు వివరాలు.. 

వయస్సు విషయానికి వస్తే, 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. అయితే, నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.

వేతన వివరాలు..

ఎంపికైన అభ్యర్థులు వారు చేపట్టే బాధ్యతలను బట్టి గౌరవ వేతనం అందుకుంటారు. బీపీఎం (BPM) పోస్టులకు నెలకు రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు, ఏబీపీఎం (ABPM) లేదా డాక్ సేవక్ పోస్టులకు రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు వేతనం ఉంటుంది. వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ..

ఈ నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు వివరాలు.. 

ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక పోస్టల్ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లకు దరఖాస్తు చేస్తే వారి అప్లికేషన్లు రద్దు చేయబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ జనవరి 31, 2026 నుంచి ప్రారంభమైంది. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 14 నుండి 16 వరకు తుది గడువుగా నిర్ణయించారు. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే, వాటిని సవరించుకోవడానికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా కోరడమైనది.

అఫీషియల్ వెబ్ సైట్: https://indiapostgdsonline.gov.in/

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×