E-Paper
Advertisement

Telegram: అడల్ట్ కంటెంట్లు.. పైరసీ సినిమాలు.. బెట్టింగ్ లింకులు.. అడ్డమైన పనులకు అడ్డ టెలిగ్రామ్, వాళ్లను అడ్డుకోలేరా?

Telegram: అడల్ట్ కంటెంట్లు.. పైరసీ సినిమాలు.. బెట్టింగ్ లింకులు.. అడ్డమైన పనులకు అడ్డ టెలిగ్రామ్, వాళ్లను అడ్డుకోలేరా?

టెలిగ్రామ్.. దేశంలో పాపులర్ మెసేజింగ్ యాప్. చాటింగ్, న్యూస్ షేర్ చేసుకోవడం, గ్రూపుల్లో చేరడం సహా ప్రతి రోజూ  లక్షలాది మంది దీనిని ఉపయోగిస్తున్నారు. స్ట్రాంగ్ ఎన్‌ క్రిప్షన్‌ తో మెసేజ్ లను ప్రైవేట్‌గా ఉంచుతుంది. యూజర్ల చాట్‌ ను ఎవరూ చదవలేరు. టెలిగ్రామ్ లోని బెస్ట్ ఫీచర్లను కొంత మంది మిస్ యూజ్ చేస్తున్నారు. పట్టుబడకుండా చట్టవిరుద్ధమైన పనులకు అడ్డగా మార్చుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా.. పోలీసులు టెలిగ్రామ్‌ వేదికగా బోలెడు నేరాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో జరిగే వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిపెట్టాయి.

నేరస్తులు టెలిగ్రామ్‌ను ఎందుకు అడ్డాగా మార్చుకున్నారు?   

టెలిగ్రామ్ ను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉపయోగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ పెద్ద గ్రూప్ లు, ఛానెల్స్: ఒక గ్రూప్ లో 200,000 మంది  సభ్యులు వరకు ఉండవచ్చు. ఛానెల్స్ లో పరిమితి అంటూ ఏమీ లేదు. అసలు పేరు చూపించకుండా ఎవరైనా వాటిలో చేరే అవకాశం ఉంది.

⦿ సీక్రెట్ చాట్స్: ఇందులో మరో ముఖ్యమైన ఫీచర్ సీక్రెట్ చాట్స్. కొంత టైమ్ తర్వాత అవి ఆటోమేటిక్ గా మాయం అవుతాయి. వాటిని ఎవరూ ఫార్వార్డ్ చేయలేరు.

⦿ ఈజీ ఫైల్ షేరింగ్: ఇందులో వీడియోలు, డాక్యుమెంట్స్ లాంటి పెద్ద ఫైల్స్ కూడా స్పీడ్ గా పంపే అవకాశం ఉంటుంది.

⦿ స్ట్రిక్ట్ చెకింగ్ లేదు: టెలిగ్రామ్ వాట్సాప్, ఫేస్‌ బుక్ లాగా ప్రతి మెసేజ్ ను, గ్రూప్ ను చెక్ చేయదు.  దీని కారణంగా, నేరస్థులు ఎక్కువగా సేఫ్ అని భావిస్తారు. పోలీసులు కూడా ఈజీగా ట్రాక్ చేయలేరని భావిస్తారు.

మోసాలు ఎలా జరుగతాయంటే?

⦿ మనీ స్కామ్స్, ఫేక్ జాబ్ ఆఫర్లు

ప్రస్తుతం దేశంలో ఈ టెలిగ్రామ్‌ ను కామన్ గా ఉపయోగిస్తున్నారు. స్కామర్లు వాట్సాప్, రాండమ్ మెసేజ్ ల ద్వారా గ్రూప్ లో యాడ్ చేస్తారు. యూట్యూబ్ వీడియోలు, టాస్క్ లు, స్టాక్స్, క్రిప్టోలో పెట్టుబడులు లాంటి ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతారు. ముందుగా యూజర్లను నమ్మించేందుకు స్క్రీన్‌ మీద నకిలీ లాభాలను చూపిస్తారు.ఈ ఆఫర్లను నమ్మి పెద్ద మొత్తంలో నష్టపోయారు కూడా.

⦿ ఆన్‌ లైన్ బెట్టింగ్

సీక్రెట్ ఛానెల్స్ క్రికెట్, ఫుట్‌ బాల్, క్యాసినో గేమ్స్ మీద బెట్టింగ్ లను ప్రోత్సహిస్తాయి. డబ్బు డిపాజిట్ చేసే నకిలీ వెబ్‌సైట్లకు అవి లింక్‌ లను ఇస్తాయి. ఒకవేళ మీరు వారికి డబ్బులు చెల్లిస్తే మళ్లీ తిరిగి రావు.

⦿ బ్లాక్‌ మెయిల్, సెక్స్‌ టార్షన్

చాలా మంది ఈ యాప్ ద్వారా ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడానికి ఇతరులను మోసం చేస్తారు. వారు చాట్ చేయడానికి నకిలీ ప్రొఫైల్‌లను ఉపయోగిస్తారు. తర్వాత మీరు డబ్బులు చెల్లించకపోతే ఆ ఫోటోలను ఫ్యామిలీ మెంబర్స్ కు పంపిస్తామని బెదిరిస్తారు.

⦿ డ్రగ్స్, వెపన్స్ అమ్మకం

ఈ యాప్ లో ఓపెన్ ఛానెల్స్ కొకైన్, MDMA, గంజాయి, గన్స్ లాంటివి అమ్ముతారు. వాటి ఫోటోలు, ధరలు, డెలివరీ వివరాలను పోస్ట్ చేస్తారు. పెద్ద నగరాల్లో క్రిప్టో లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా చెల్లింపులు చేస్తారు.

⦿ పైరేటెడ్ సినిమాలు

ఈ చానెల్స్ లో పైరేటెడ్ సినిమాలను షేర్ చేయడం కామన్. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ లను షేర్ చేస్తారు. లక్షలాది మంది ప్రతిరోజూ డౌన్‌లోడ్ చేసుకుంటారు.

⦿ ఎగ్జామ్ పేపర్ల లిక్

2024లో, NEET, UGC-NET వంటి పెద్ద పరీక్షలు టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఒక్కో పేపపర్ రూ.5,000 నుంచి రూ. 10 లక్షలకు అమ్ముడయ్యాయి. చాలా మంది వీటిని ఎగ్జామ్ కు ముందే కొనుగోలు చేశారు. ఈ కారణంగా పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి.

⦿  చైల్డ్ పోర్న్, అడల్ట్ కంటెంట్ షేరింగ్

టెలిగ్రామ్ లోని సీక్రెట్ గ్రూప్స్ లో చట్టవిరుద్ధంగా పిల్లల వీడియోలు, ఫోటోలు, అడల్ట్ కంటెంట్ షేర్ చేస్తాయి.

ప్రభుత్వం ఏం చేస్తుంది? 

2024లో టెలిగ్రామ్ CEO ఫ్రాన్స్‌ లో అరెస్టు అయిన తర్వాత, భారత్ దర్యాప్తు మొదలు పెట్టింది.  హోంశాఖ టెలిగ్రామ్ మీద ఫోకస్ పెట్టింది. టెలిగ్రామ్ వినియోగదారుల డేటాను పోలీసులతో పంచుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు పలు ఛానెల్స్ బ్లాక్ చేస్తున్నా కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే, నేరాల నియంత్రణ తగ్గకపోతే బ్యాన్ చేసే అంశంపై ఆలోచన చేస్తుంది.

టెలిగ్రామ్‌ లో సేఫ్ గా ఎలా ఉండాలంటే?  

⦿ టెలిగ్రామ్ కామన్ యూసేజ్ కోసం మంచిది. కానీ.. జాగ్రత్తగా ఉండాలి.

⦿ తెలియని గ్రూపులలో ఎప్పుడూ జాయిన్ కాకూడదు. లింక్‌లను క్లిక్ చేయకూడదు.

⦿ అపరిచితులకు ఉద్యోగాల కోసం, పెట్టుబడుల కోసం డబ్బులు చెల్లించకూడదు.

⦿ ప్రైవేట్ ఫోటోలు, బ్యాంక్ వివరాలను ఎప్పుడూ షేర్ చేయకూడదు.

⦿ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే, ఆధారాలను సేవ్ చేసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

⦿ ఏదైనా మోసం జరిగితే cybercrime.gov.in లో సైబర్ పోలీసులకు తెలియజేయాలి. లేదంటే 1930కు కాల్ చేయాలి.

Read Also:  2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×