E-Paper
Advertisement

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!
Advertisement

Water Jacket: వాతావరణం నుంచి తేమను పీల్చుకుని, ఏకంగా తాగునీరుగా మార్చే సరికొత్త జాకెట్ ను పరిశోధకులు కనుగొన్నారు. టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీర్లు దీనికి రూపకల్పన చేశారు. ఇంతకీ ఈ జాకెట్ ఎలా పనిచేస్తోంది? తేమను తాగునీటిగా ఎలా మారుస్తుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రోజుకు 900ml నీరు ఉత్పత్తి

వాతావరణంలోని ఆర్ద్రత ఆధారంగా ఈ జాకెట్ రోజుకు దాదాపు 14 నుండి 30 ఔన్సుల (సుమారు 400ml – 900ml) స్వచ్ఛమైన నీటిని తయారు చేస్తుందని టెక్సాస్ ఇంజనీర్లు తెలిపారు. ఇది ఇళ్లలోని ట్యాప్ తరహాలో లీటర్ల కొద్ది మంచి నీటిని ఇవ్వకపోయినా.. ట్రెక్కింగ్ చేసేవారు, సైనికులు, అత్యవసర సహాయక బృందాలు, దూర ప్రాంతాల్లో పనిచేసే వారికి ఒక అద్భుతమైన లైఫ్ సేవర్ గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

గాలి నుంచి నీరు.. ఎలా సాధ్యం?

Advertisement

ఆకాశం పొడిగా కనిపించినా మనం పీల్చే గాలిలో నీటి ఆవిరి నిరంతరం ఉంటూనే ఉంటుంది. చల్లటి నీటి గ్లాసు వెలుపల నీటి చుక్కలు చేరే సాధారణ సూత్రాన్నే ఇంజనీర్లు ఈ జాకెట్ విషయంలో వాడారు. కాకపోతే ఈ పరిశోధకులు నీటిని ఆకర్షించే ‘హైడ్రోజెల్ టెక్స్‌టైల్ ఫైబర్ల’ను ఇందుకోసం ఉపయోగించారు. చుక్సిన్ లీ, గుయిహువా యూలు రూపొందించిన ఈ ప్రత్యేక వస్త్రం.. గాలిలోని తేమను స్పాంజిలా పీల్చుకుంటుంది. అలా గ్రహించిన తేమను జాకెట్‌కు ఉండే ఫోల్డబుల్ బ్యాగుల్లోకి చేరుస్తుంది.

సూర్యరశ్మితో తాగునీరు

అయితే ఈ సేకరించిన తేమను ఒక చిన్న ఫోల్డబుల్ పరికరంలో ఉంచి సూర్యరశ్మి ద్వారా వేడి చేస్తారు. ఆ వేడికి హైడ్రోజెల్ నీటిని విడుదల చేస్తుంది. అది ద్రవ రూపంలోకి మారి తాగునీరుగా మారుతుంది. దీని కోసం బ్యాటరీలు, విద్యుత్‌ను వాడాల్సిన అవసరం లేకపోవడం విశేషం.

చిన్న మొత్తమైనా ప్రాణరక్షణే!

Advertisement

అయితే ఈ జాకెట్ ద్వారా రోజుకు లభించే 30 ఔన్సుల చూడటానికి తక్కువే అయినా.. అడవిలో తప్పిపోయిన వ్యక్తికి, తీవ్రమైన ఎండలో పనిచేసే వారికి ఇది ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని చెప్పవచ్చు. దాహార్తిని తీర్చుకొని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది సాయపడుతుంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

పరీక్షల్లో సత్ఫలితాలు..

ఎడారి ప్రాంతంలో ఈ జాకెట్ ను పరీక్షించగా అది సత్ఫలితాలు ఇచ్చినట్లు పరిశోధకలు తెలిపారు. గాలిలో తేమ ఉండే ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా వంటి ప్రాంతాల్లో ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టెక్సాస్ విశ్వవిద్యాలయం ఈ జాకెట్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఉత్పత్తి ఖర్చు, మన్నిక, నీటి రుచి వంటి అనేక అంశాలపై మరిన్ని పరీక్షలు పూర్తయితే ఈ ఆసక్తకరమైన జాకెట్ మార్కెట్‌లోకి రానుంది.

Also Read: మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

Related News

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

Big Stories

Advertisement
×