Big Stories

Best Camera 5G Smartphones: రూ.25 వేలలో ది బెస్ట్ కెమెరా కలిగిన 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Best Camera 5G Smartphones Under Rs 25000: తక్కువ ధరలో అదిరిపోయే కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని చూస్తున్నారా?. అయితే అందులో ఏ ఫోన్ అయితే మంచి కెమెరా క్వాలిటీ అందిస్తుందో తెలియక సతమతమవుతున్నారా?. అందుకోసం ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారా?. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. అద్భుతమైన క్వాలిటీ కెమెరా గల స్మార్ట్‌ఫోన్ల లిస్ట్‌ను ఇక్కడ ఉంచాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. అవి ఏంటేంటంటే..

- Advertisement -

Samsung Galaxy F54 5G:

- Advertisement -

సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 54 5జీ ఫోన్ మంచి డిజైన్, స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB RAM + 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. Exynos 1380 ప్రాసెసర్ దీని సొంతం. ఈ ఫోన్ Android 13-ఆధారిత One UIపై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే దీని కెమెరా విషయానికొస్తే.. 108MP సెన్సార్, 8MP సెన్సార్, 2MP సెన్సార్.. 32MP ఫ్రంట్ కెమెరా ఆప్షన్లతో వస్తుంది. ఫొటోల కోసం చూసేవారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ధర అమెజాన్‌లో రూ.22,490గా ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Vivo T3 5G:

వివో కంపెనీ ఇటీవల తన టి సిరీస్‌లో ‘వివో టి 3’ మోడల్‌ను లాంచ్ చేసింది. కస్టమర్‌లు పరిగణించగలిగే మరో మంచి కెమెరా ఫోన్ ఇది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో ఆక్టాకోర్ MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఈ ఫోన్‌ను శక్తివంతం చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP, 2MP సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999గా ఉంది. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు తగ్గింపు వస్తుంది.

Also Read: ఐఫోన్ 14, 15పై సూపర్ డిస్కౌంట్ మచ్చా.. రూ.37 వేల లోపే కొనేయొచ్చు.. !

Infinix Note 40 Pro 5G:

రూ.25 వేల కంటే తక్కువ ధరలో ఉన్న మరో ఫోన్ Infinix Note 40 Pro 5G. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ వెనుకవైపు 108MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999లకి కొనుక్కోవచ్చు. అలాగే HDFC and SBI క్రెడిట్, డెబిట్ కార్డుపై రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు.

OnePlus Nord CE 4:

మీరు కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇటీవల ప్రారంభించబడిన OnePlus Nord CE 4 మంచి ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 16MP కెమెరాను పొందుతారు. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,361గా ఉంది. అందువల్ల తక్కువ ధరలో మంచి కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇవే బెస్ట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News