BigTV English

Electricity Bill Dispute : కరెంట్ బిల్లుపై గొడవ.. మహిళా టెక్నీషియన్ ను చంపిన వ్యక్తి

Electricity Bill Dispute : కరెంట్ బిల్లుపై గొడవ.. మహిళా టెక్నీషియన్ ను చంపిన వ్యక్తి

Technician killed over electricity bill dispute : కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, అలా ఎందుకు వచ్చిందో చెప్పాలని విద్యుత్ అధికారులను ప్రశ్నించాడో వ్యక్తి. అందుకు సరిగ్గా స్పందించకపోవడంతో మహిళా టెక్నీషియన్ ను ఆఫీస్ లోనే పొడిచి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లా మోర్గావ్.. సుపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


33 సంవత్సరాల అభిజిత్ పోటేకు రూ.570 అధికంగా కరెంట్ బిల్లు వచ్చింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు మోర్గావ్ లోని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కో లిమిటెడ్ కార్యాలయానికి వెళ్లాడు. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా తన కరెంట్ బిల్లుపై స్పందించకపోవడంతో.. ఎంఎస్ఈడీసీఎల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రింకు తితే (26)పై కత్తితో దాడి చేశాడు.

Also Read : వ్యక్తి హత్యకు కారణమైన చపాతీ.. ఇద్దరిపై కేసు


ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన ఏప్రిల్ 24, బుధవారం జరిగింది. పదిరోజుల సెలవు తర్వాత ఆఫీస్ కు వచ్చిన రింకుపై కత్తితో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు రింకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. అభిజిత్ పై కేసు నమోదు చేశారు. 302 సెక్షన్ తో పాటు.. ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అభిజిత్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×