E-Paper
Advertisement

ఈ పెద్దాయన 72 ఫోన్లతో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, ఎందుకో తెలిస్తే వావ్ అంటారు!

ఈ పెద్దాయన 72 ఫోన్లతో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, ఎందుకో తెలిస్తే వావ్ అంటారు!
Advertisement

Pokemon Go Grandpa: తైవాన్‌కు చెందిన చెన్ సాన్-యువాన్ కథ వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా 60 ఏళ్లు దాటాయంటే చాలు.. ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఈ తాతయ్య రూటే వేరు. తన 66వ ఏట.. అంటే రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వయసులో ‘పోకీమాన్ గో’ అనే మొబైల్ గేమ్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అదేదో సరదాగా ఆడి వదిలేయకుండా.. ప్రపంచమే తనవైపు చూసేలా చేసుకుని ‘పోకీమాన్ గో గ్రాండ్‌పా’గా ఫేమస్ అయిపోయారు.

ఏకంగా డెబ్బైకి పైగా స్మార్ట్‌ఫోన్లతో..

చెన్ ఈ గేమ్‌ను మొదలుపెట్టినప్పుడు కేవలం 11 ఫోన్లు మాత్రమే వాడేవారు. కానీ ఆ పిచ్చి ఎంతలా పెరిగిందంటే.. ఫోన్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే పోయింది. 2020 నాటికి 64 ఫోన్లు వాడిన ఈయన.. 2022 కల్లా ఏకంగా 72 స్మార్ట్‌ఫోన్లను తన సైకిల్‌కు అమర్చుకున్నారు. అసలు అన్ని ఫోన్లను తన సైకిల్ హ్యాండిల్‌కు తగిలించుకుని తైపీ నగర వీధుల్లో తిరుగుతుంటే.. చూసే జనం అది సైకిలా లేక ఏదైనా టెక్నాలజీ ల్యాబా అని ఆశ్చర్యపోయేవారు. ఆయన క్రేజ్ చూసి ఆసుస్ లాంటి పెద్ద కంపెనీలే ఆయన్ని పిలిచి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ ఏంటో.

Advertisement

Also Read: ఫోన్ కొంటే ఇలాంటిదే కొనాలి బ్రో.. పవర్ బ్యాంక్ అవసరం లేని బ్యాటరీ.. డీఎస్ఎల్ఆర్ రేంజ్ కెమెరా!

నలుగురికి సాయం చేయడం కోసం..

సాధారణంగా గేమ్ ఆడేవారంతా పక్కవాడి కంటే ఎక్కువ పాయింట్లు సాధించాలని, రికార్డులు క్రియేట్ చేయాలని తాపత్రయపడతారు. కానీ మన తాతయ్య మనస్తత్వం వేరు. ఆయన రోజుకు ఏకంగా 20 గంటల పాటు రోడ్ల మీద తిరుగుతూ ఈ గేమ్ ఆడేవారు. దీని కోసం నెలకు లక్షల రూపాయల డేటా బిల్లులు, గేమింగ్ ఖర్చులు భరించేవారు. అయితే ఇదంతా కేవలం తన కోసం కాదు.. ఇతర యువ ఆటగాళ్లకు సాయం చేయడం కోసం. గేమ్‌లో కొత్త పోకీమాన్‌లను ఆకర్షించే సెటప్స్ వేసి, తద్వారా చిన్నపిల్లలు, యువత ఈజీగా గేమ్‌లో ముందుకు వెళ్లేలా చేసేవారు. ఇలా చేయడం వల్ల తన మెదడు చురుగ్గా ఉంటుందని, నలుగురితో మాటలు కలుస్తాయని ఆయన సరదాగా చెప్పేవారు.

అభిమానులను కలవరపెట్టిన ఆ విషయం..

Advertisement

ఎంతో హుషారుగా కనిపించే ఈ పోకీమాన్ తాతయ్య ప్రయాణం 2022లో కాస్త నెమ్మదించింది. ఆయనకు పక్షవాతం (స్ట్రోక్) రావడంతో అప్పటి నుండి బయట తిరగడం తగ్గించేశారు. ప్రస్తుతం మనం ఇంటర్నెట్‌లో చూస్తున్న వీడియోలన్నీ ఆయన గతంలో సందడి చేసినప్పటివే. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని సమాచారం ఉన్నా.. మునుపటిలా సైకిల్ మీద ఆ ఫోన్ల సెటప్‌తో కనిపించడం లేదు. ఏది ఏమైనా.. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, మనసుంటే మార్గం ఉంటుందని చెన్ సాన్-యువాన్ నిరూపించారు. టెక్నాలజీ అంటే కేవలం కుర్రాళ్లదే కాదు.. తనలాంటి వాళ్లకు కూడా అని చూపించిన ఈ తాతయ్య నిజంగా ఒక లెజెండ్ కదా.

Also Read: ఇక ఫోన్ అస్సలు వేడెక్కదు.. లోపలే ఫ్యాన్ అమర్చిన రెడ్‌మీ, ఫీచర్లు అదుర్స్ అంతే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×