E-Paper
Advertisement

Social Media Data Consuming: ఒక నిమిషానికి 90 లక్షల జీబీ డేటా వాడకం.. దూసుకుపోతున్న సోషల్ మీడియా

Social Media Data Consuming: ఒక నిమిషానికి 90 లక్షల జీబీ డేటా వాడకం.. దూసుకుపోతున్న సోషల్ మీడియా
Advertisement

Social Media Data Consuming: ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ.. సోషల్ మీడియాలో ఏదొక విషయాన్ని స్ర్కోల్ చేస్తూనే ఉంటాం. ఇక జెన్-జెడ్ అయితే సోషల్ మీడియాకు అంటుకుపోతుంటారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్, ఎక్స్ , లింక్డ్ ఇన్, పింట్ రెస్ట్.. ఇలా సోషల్ మీడియా వెబ్ సైట్లను తెగ వాడేస్తు్న్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాను ఎంతలా వాడుతున్నారో? లెక్కలు తీశారు. ఈ డేటా చూస్తే షాక్ తింటారు.

93 శాతం మంది సోషల్ మీడియా వాడకం

ప్రపంచవ్యాప్తంగా సుమారు 517 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులున్నారు. 2025లో సోషల్ మీడియా వాడకం గతేడాది కంటే 4.87% పెరిగింది. అంటే 25.9 కోట్ల కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. ఇంటర్నెట్ వాడుతున్న వారిలో 93% మంది ప్రతి నెలా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. నెలకు 6–7 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను టచ్ చేస్తున్నారు.

ఫేస్ బుక్ టాప్

Advertisement

ఫేస్ బుక్ 307 కోట్ల కస్టమర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా ఉంది. ఇన్ స్టా గ్రామ్ కు 300 కోట్ల యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. టిక్ టాక్ వినియోగదారుల సంఖ్య 150 కోట్లకు పైగా ఉంది. 2025లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్లాట్‌ఫామ్‌లుగా టిక్‌టాక్, లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షార్ట్ వీడియో కంటెంట్ కు ఎక్కువ ఆదరణ ఉంది. ట్విట్టర్, లింక్డ్‌ఇన్‌లలో పోస్ట్‌లకు కామెంట్స్ భారీగా పెరుగుతున్నాయి.

కోటికి పైగా వాట్సాప్ మెసేజ్ లు

2012లో సగటున 90 నిమిషాలుగా ఉన్న సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ రేట్ ప్రస్తుతం 56.6% పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 34 కోట్ల మంది యూట్యూబ్ వీడియోలను చూస్తున్నారు. 25.1 కోట్ల ఈ-మెయిల్‌లను పంపుతున్నారు. కోటికి పైగా వాట్సాప్ మెసేజ్‌లు సెండ్ చేస్తున్నారు. రెండు కోట్ల గూగుల్‌ సెర్చ్‌లు అవుతున్నాయి. 2025-2026 డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 9-10 పెటాబైట్‌ల అంటే 90 లక్షల జీబీల కంటే ఎక్కువ డేటా క్రియేట్ చేయడం, కాపీ చేయడం, వినియోగించడం చేస్తున్నారు. డేటా వినియోగంలో ఎక్కువగా ఉంది వీడియో స్ట్రీమింగ్. మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 80% కంటే ఎక్కువ వీడియో స్ట్రీమింగ్ ఉంది. సోషల్ మీడియా, ఐవోటీ వినియోగంతో నిరంతరంగా డేటా అప్‌లోడ్‌ పెరిగింది.

Advertisement

Also Read:  టీవీఎస్ To బజాన్, 2026లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

 

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×