Sravanthi Chokarapu: ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్.. ఎలాంటి కాంట్రవర్సీకి దారితీశాయో తెలియంది కాదు. అనసూయ, చిన్మయి వంటి వారు యాడ్ అవడంతో ఈ కాంట్రవర్సీ చాలా రోజులు నడిచింది. ఆ తర్వాత జరిగిన కొన్ని ఈవెంట్స్‌లో అంతా నిండుగానే డ్రెస్సింగ్ చేసుకుని వచ్చారు, వస్తున్నారు. కొందరు ఎలాగూ వారి యాటిట్యూడ్ మార్చుకోలేదనుకోండి. అయినా సరే, ఒక ఆలోచన అయితే శివాజీ కలిగించగలిగారు. తాజాగా ‘హే బల్వంత్’ (Hey Balwanth) సినిమాతో నటిగా అరంగేట్రం చేసి, మంచి సక్సెస్ అందుకున్న స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu).. శివాజీ కాంట్రవర్సీ తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ మార్చేశారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానమిస్తూ.. శివాజీ (Sivaji) కాంట్రవర్సీపై కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
‘‘మనం ఎక్కడున్నా సరే… ఎండ్ ఆఫ్ ది డే మనం పబ్లిక్ ఫిగర్‌గా నిలబడుతున్నామంటే, ఫస్ట్ చూసేది బట్టలే కదా. దాని తర్వాత మనం ఏం మాట్లాడుతున్నామనేది చూస్తారు. గద్దర్ అవార్డ్స్ టైమ్‌లో చేనేత కార్మికులను సపోర్ట్ చేసేందుకు నేను చీర కట్టుకుని వెళితే.. ‘‘మీరేంటి? హ్యాండ్లూమ్‌ని ప్రమోట్ చేస్తున్నారా? బాగున్నారు.. బాగుంది’’ అని అల్లు అర్జున్ ఎంత క్యూట్‌గా చెప్పారంటే.. నేనయితే ఆయన అలా అంటారని అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. శివాజీ కాంట్రవర్సీ తర్వాతే స్రవంతి తన డ్రెస్సింగ్ సెన్స్ మార్చేసిందని అంతా అంటున్నారు. ముందు నుంచి నేను ట్రెడిషనల్ డ్రెస్సింగ్‌లోనే కనిపించాను. నిజంగా ఆయన షో వల్లే డ్రెస్సింగ్ సెన్స్ మారిందని అనుకున్నా.. హ్యాపీనే! కనీసం ఒక అమ్మాయి అయినా ఆయన మాట విని, మారిందని అనుకుంటారు.. మంచిదే కదా. డ్రెస్సింగ్ అనేది కంఫర్ట్‌ని బట్టి ఉంటుంది. ఎవరికి నచ్చింది వారు వేసుకోవచ్చు. నన్ను ఎవరైనా సరే.. మీకు కంఫర్టబుల్ డ్రస్ ఏది అని అడిగితే.. ఎప్పుడైనా సరే.. చీర అనే చెబుతాను.
Also Read- Deepika Padukone: ట్రోలర్స్‌కు దీపికా కౌంటర్.. అలా అనేసిందేంటీ?
పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు కొన్ని ఫేస్ చేయాలి. ఎన్నో రకాల అవమానాలు ఉంటాయి. కానీ, నాకు మా అమ్మ ఇచ్చిన ధైర్యం.. ఇక్కడ ఉపయోగపడుతుంది. 2014లో అమ్మ చనిపోయారు. లైఫ్‌లో పడిన కష్టాలే నన్ను ఇంత స్ట్రాంగ్ చేశాయని అనిపిస్తుంది. నువ్వట్ల, నువ్విట్లా అని ఎన్నో మాటలు పడ్డాను. అప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు.. ఏం చేసినా నేను చేసుకోవాలి.. అది రాంగ్ అయినా, రైట్ అయినా.. నేనే సరిదిద్దుకోవాలి లైఫ్‌ని అని ఫిక్స్ అయ్యాను. సరే ఎన్ని రోజులు తిడుతారు.. మహా అయితే.. చూద్దాం చూద్దాం చూద్దాం.. అలా 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉన్నాను.. ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్. ఏ ఫీల్డ్ అయినా సరే.. ఓపిక ఉండాలి..’’ అని స్రవంతి ఎమోషనల్ అయ్యారు.
Also Read- Renu Desai: అమ్మవారి దుస్తుల్లో ఉన్న నన్ను.. ‘నైట్‌కు రేటు ఎంత?’ అని అడుగుతారా?