E-Paper
Advertisement

Best-Selling Electric Scooters: టీవీఎస్ To బజాన్, 2026లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Best-Selling Electric Scooters: టీవీఎస్ To బజాన్, 2026లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Best-Selling Electric Two-Wheeler Brands in India: ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మరింత పెరిగాయి. గత ఏడాదిలో పోల్చితే పెద్ద సంఖ్యలో సేల్ అవుతున్నాయి. జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్‌గా TVS అవతరించింది. బజాజ్, ఏథర్ వరుసగా రెండు, మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉండటంతో, ఈ బ్రాండ్‌లు మంచి ఆదరణ దక్కించకుంటున్నాయి. జనవరిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ టూవీలర్స్, వాటి మార్కెట్ షేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ TVS

TVS జనవరి 2026లో 34,558 యూనిట్లను అమ్మింది. గత సంవత్సరం ఇదే నెలలో 24,028 EVలు అమ్ముడయ్యాయి. 43.82% పెరుగుదల చూసింది. ఈ బ్రాండ్ 28.14% అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. కొత్త ఆవిష్కరణలపై కంపెనీ దృష్టి సారించడం, పెరుగుతున్న EV ఆదరణ నేపథ్యంలో మార్కెట్ లో ఈ బ్రాండ్ సత్తా చాటుతోంది.  ఈ కంపెనీ చెందిన ఐక్యూబ్ అమ్మకాల్లో టాప్ లో కొనసాగుతుంది.

⦿ బజాజ్

Advertisement

బజాజ్ 25,598 ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత ఏడాదితో పోల్చితే 19.23% వృద్ధిని సాధించింది. చేతక్ తయారీదారు గత సంవత్సరం జనవరిలో 21,470 EVలను విక్రయించింది. ఈ ఏడాది 20.84% ​​మార్కెట్ వాటాతో, బజాజ్ స్థిరమైన పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.

⦿ ఏథర్

గత నెలలో ఏథర్ 21,999 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది మునుపటి సంవత్సరం కంటే 67.97% పెరుగుదలను కనబరిచింది. గత ఏడాది 13,097 EVలను అమ్మింది. 17.91% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఏథర్ ప్రీమియం, ఫీచర్ లోడెడ్ స్కూటర్లను అందించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా పెద్ద బ్రాండ్ గా అవతరించింది.

⦿ హీరో మోటోకార్ప్

Advertisement

హీరో మోటోకార్ప్ EV బ్రాండ్ విడా ద్వారా, ఈ సంవత్సరం జనవరిలో 718.08% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 13,302 యూనిట్లను విక్రయించింది. మార్కెట్‌లో 10.83%ని కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన పెరుగుదల హీరో  విస్తృతమైన  నెట్‌వర్క్, లమైన బ్రాండ్ వ్యాల్యూతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలో సత్తా చాటుతోంది.

Read Also:  ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. క్రేజీ లుక్, అదిరిపోయే మైలేజ్!

⦿ ఓలా

ఓలా ఎలక్ట్రిక్ జనవరి 2026లో 7,516 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 69.21%  తగ్గుదలను సూచిస్తుంది. 6.12% మార్కెట్ వాటాను కలిగి ఉన్నప్పటికీ, మార్కెట్ క్షీణత కనిపించింది. సరఫరా పరిమితులు, పెరిగిన పోటీ కారణంగా ఓలా ప్రభావం తగ్గుతూ వస్తోంది.

Read Also: ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జోష్, టాప్ లో టీవీఎస్, ఏడో స్థానానికి పడిపోయిన ఓలా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×