BigTV English
Advertisement

Kasthuri Shankar: రేణుక స్వామి మర్డర్ కేస్.. పవిత్ర తప్పేం ఉంది.. అలా అనడానికి మీకేం హక్కు ఉంది

Kasthuri Shankar: రేణుక స్వామి మర్డర్ కేస్.. పవిత్ర తప్పేం ఉంది.. అలా అనడానికి మీకేం హక్కు ఉంది

Kasthuri Shankar: సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంది. ఎవరు మాట్లాడని విషయాల గురించి కస్తూరి సోషల్ మీడియాలో మాట్లాడుతూ హైప్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె మాటలలో నిజం ఉన్నా కూడా విమర్శలు మాత్రం తగ్గడం లేదు.


ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నది హీరో దర్శన్. ప్రేమించిన అమ్మాయిని ఏదో అన్నాడని, అభిమాని అయిన రేణుక స్వామిని అతికిరాతకంగా చంపిన విషయం తెల్సిందే. చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడలపై అభియోగాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో దర్శన్ తో పాటు మరి కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ తో నటి పవిత్ర గౌడ అక్రమ సంబంధం పెట్టుకుందని, అది తప్పు అని చెప్పినందుకు రేణుక స్వామిని చిత్ర హింసలు చేసి దర్శన్ చంపాడని తెలుస్తోంది.

అయితే పవిత్ర మాత్రం.. అతను తనను వేధించాడని, అసభ్యకరమైన సందేశాలు పంపుతూ తనను చిత్ర హింసలకు గురిహాచేసినట్లు తెలిపింది. ఈ కేసుపై పలువురు ప్రముఖులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇక కస్తూరి శంకర్ కూడా ఈ కేసుపై స్పందించింది. పవిత్ర గౌడకు ఆమె సపోర్ట్ చేసి మాట్లాడడం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.


” పవిత్ర, దర్శన్ స్నేహితురాలు మాత్రమే భాగస్వామి కాదు. నేను చెడును, హింసను క్షమించను. కానీ, దర్శన్, పవిత్ర జీవితం వారి వ్యక్తిగతం. వారి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉంది. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు.

బాధితురాలు అమాయకురాలు. ఆమెను ఎంతో వేధించాడు. దానికి దర్శన్ చేసిన పని కరెక్ట్ అని నేను అనడం లేదు. అతని చేసిన పని నేను ఒప్పుకోవడం లేదు. అందుకు పోలీసులు, కోర్టులు ఉన్నాయి. సెలబ్రిటీలను వేధించే హక్కు ప్రజలకు ఎవరు ఇచ్చారు” అని ఘాటుగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ముగుస్తుందో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×