Realme 15 5G vs Redmi 15 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బడ్జెట్ 5G కేటగిరీలో గట్టిగా పోటీ పడుతున్నాయి. రియల్‌మీ, షావోమీ కంపెనీలు ఇటీవల ఇండియాలో Realme 15 5G, Redmi 15 5G లాంచ్ చేశాయి. ఈ రెండు ఫోన్‌లు వేగవంతమైన పెర్ఫార్మెన్స్, పెద్ద బ్యాటరీలు, AI ఫీచర్లు, అందమైన డిజైన్‌లను తీసుకొస్తున్నాయి. మీరు ఏది కొనుగోలు చేయాలో? నిర్ణయం తీసుకోవడానికి ఈ రెండు ఫోన్ల ఫీచర్లను కలిపి పోల్చి చూద్దాం. ఏది మంచి వాల్యూ ఇస్తుందో తెలుసుకుందాం.
Redmi 15 5G ప్రారంభ ధర ₹14,999. ఇది 6GB + 128GB మోడల్‌కు. 8GB + 256GB వెర్షన్ ₹16,999కు లభిస్తుంది.
Realme 15 5G మాత్రం ప్రారంభ ధర కాస్త ఎక్కువ. – 8GB + 128GBకు ₹25,999, 8GB + 256GBకు ₹30,999.
ధర విషయంలో Redmi స్పష్టంగా విన్నర్.
Redmi 15 5Gలో 6.9-ఇంచ్ FHD+ అడాప్టివ్ సింక్ డిస్‌ప్లే ఉంది, 144Hz రిఫ్రెష్ రేట్‌తో. ఇది TÜV Rheinland ట్రిపుల్-సర్టిఫైడ్, కళ్లకు అలసట తగ్గించడానికి.
Realme 15 5G మాత్రం స్లిమ్ ప్రొఫైల్‌తో ఉంది, కేవలం 7.69mm మందం, Flowing Silver డిజైన్‌లో. ఇది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది, కానీ ఎలాంటి సర్టిఫికేషన్ లేదు.
ఇక్కడ Redmiకు పెద్ద డిస్‌ప్లే అడ్వాంటేజ్ ఉండగా.. Realme స్లిమ్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది.
Redmi 15 5Gలో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్ ఉంది, 8GB RAMతో. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Xiaomi HyperOS 2పై రన్ అవుతుంది.
Realme 15 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ ప్రాసెసర్ ఉంది, AI ఆధారిత గేమింగ్ ఆప్టిమైజేషన్‌లతో. ఇది కూడా ఆండ్రాయిడ్ 15పై Realme UI స్కిన్‌తో రన్ అవుతుంది.
రెండు ఫోన్‌లు మంచి ఆప్షన్‌లే, కానీ గేమింగ్‌లో Realme కాస్త మెరుగు – AI ట్యూన్డ్ పెర్ఫార్మెన్స్‌తో గేమింగ్ ఆప్టిమైజ్ అయింది.
Redmi 15 5Gలో 50MP AI డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. AI Sky, AI Erase, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్లు ఉన్నాయి.
Realme 15 5Gలో డ్యూయల్ 50MP కెమెరా సెటప్, Sony IMX882 సెన్సర్‌తో, ఫ్రంట్‌లో 50MP కెమెరా. 4K రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది.
Realme కెమెరా సెటప్ మెరుగు, ముఖ్యంగా సెల్ఫీలు, వీడియో క్రియేటర్లకు.
రెండు ఫోన్‌లలోనూ 7000mAh బ్యాటరీ ఒకేలా ఉంది, కానీ Redmiలో 33W ఛార్జింగ్ మాత్రమే, Realmeలో 80W ఛార్జింగ్ సపోర్ట్.
ఛార్జింగ్ స్పీడ్‌లో Realme విన్నర్, బ్యాటరీ సైజ్‌లో రెండూ సమానం.
Redmi 15 5G బడ్జెట్ బయ్యర్లకు సరైన చాయిస్, ₹15,000 లోపు ధరలో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. Realme 15 5G మాత్రం ధర ఎక్కువగా ఉన్నా.. మంచి వాల్యూ ఇస్తుంది – సాలిడ్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, స్లిమ్ ఫోన్‌తో. చివరికి మీరు ఏది వాల్యూ చేస్తారో దానిపై డిపెండ్ అవుతుంది – బెస్ట్ వాల్యూ ఫర్ మనీ లేదా హైయర్ ప్రైస్‌లో మెరుగైన ఫీచర్లు మరియు పెర్ఫార్మెన్స్.
Also Read: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?