Star Heroine:సాధారణంగా ఎక్కడైనా సరే మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఏ రంగం చూసుకున్నా సరే.. పురుషాధిపత్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉందని, ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం పురుషాధిపత్యంపై కామెంట్లు చేయడమే కాకుండా వారిలో వచ్చిన మార్పుల గురించి, వారు ప్రవర్తించే తీరు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అందుకే తాను తన జీవితంలో మగవాడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఇక భవిష్యత్తులో మగవాడిని నమ్మాలంటేనే భయం వేస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
అందుకే అబ్బాయిలను నమ్మకూడదు – డైసీ షా
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా(Daisy Shah) .. సల్మాన్ ఖాన్ (Salman Khan) తో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అబ్బాయిలపై ఊహించని బోల్డ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ..” నేను ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలో పడ్డాను. వాళ్ళిద్దరూ కూడా నాపై నమ్మకంగా ఉన్నట్టు అనిపించలేదు. నేను వేరే అబ్బాయితో కామన్ గా డాన్స్ చేస్తే రెండో లవర్ వద్దన్నాడు. కానీ అతడు మాత్రం ఇంకో అమ్మాయితో తిరిగేవాడు. ఏమైనా అంటే మాత్రం అర్థం చేసుకోవాలి అని నన్నే అనేవాడు. కానీ అది నాకు నచ్చేది కాద. అందుకే అతడిని వదిలేసాను. అమ్మాయి ఒకరితో తిరిగితే తప్పు కానీ అబ్బాయి రిలేషన్ లో ఉండి కూడా ఇంకొక అమ్మాయితో తిరిగినా తప్పుగా పరిగణించకూడదు. ఇదెక్కడి న్యాయం” అంటూ ఆమె ప్రశ్నించింది.
మహిళ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి – డైసీ షా
అలాగే మహిళ ఎప్పుడూ ఇండిపెండెంట్ గా ఉండాలి అని, ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఆడవాళ్లు మగవారి మీద ఆధార పడాల్సిన అవసరం అంతకంటే లేదు అని , తన వరకు తనకు ఇలాగే అనిపిస్తుందని.. ఇప్పటివరకు తాను ఆర్థికంగా బాగానే ఉన్నాను కాబట్టే.. ఎవరి మీద ఆధారపడాలని అనుకోవట్లేదు అంటూ తెలిపింది.. ముఖ్యంగా జీవితంలో పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తాను ఇంకా తీసుకోలేదని కూడా తెలిపింది. డైసీషా.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
డైసీషా సినిమాల విషయానికి వస్తే..
మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. నటిగా నృత్యకారిణిగా కూడా పేరు సొంతం చేసుకుంది. ప్రధానంగా కన్నడ, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా కూడా పనిచేసింది. ఇక డాన్సర్ నుండి నటిగా మారిన తర్వాత 2011లో విడుదలైన కన్నడ చిత్రం భద్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2014లో హిందీ సినిమా జై హో లో సల్మాన్ ఖాన్ సరసన నటించిన ఈమె ఆ తర్వాత తమిళం , మరాఠీ, గుజరాతి సినిమాలలో కూడా నటించింది.
ALSO READ:Kalyani Priyadarshan: కమిట్మెంట్ పై అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్.. అందుకే జాగ్రత్త వహిస్తున్నానంటూ?