Vastu Secret : మనం చిన్నప్పుడు నెమలి ఈకలను ఎంత ఇష్టపడేవాళ్లమో గుర్తుందా? స్కూల్ దగ్గర గానీ, ఎక్కడైనా బయట నెమలి ఈక కనబడితే దాన్ని తీసుకుని ఎంతో ఆనందపడే వాళ్లం. నోట్‌బుక్‌లో దాచుకుని, రోజూ చూసుకుంటూ సంతోషించేవాళ్లం. అప్పట్లో కేవలం అందంగా, రంగు రంగులుగా కనిపిస్తాయని ఇష్టపడినా… వాస్తవానికి ఈ నెమలి ఈకలకు ఉన్న విలువ, శక్తి ఎంతో ప్రత్యేకమైనది. హిందూ సంప్రదాయం ప్రకారం, నెమలి ఈకలు కేవలం అలంకరణకే కాదు, ఆధ్యాత్మిక, వాస్తు, మానసిక ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని చెబుతారు. శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈక ఉండటమే ఈకలకు దైవికతను చేకూర్చింది.
నెమలి ఈకలు ఇంట్లో ఉంటే..
మొదటగా, నెమలి ఈకలు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సూచిస్తాయి. వీటి రంగులు, కన్ను ఆకారంలోని నమూనాలు చెడు శక్తులను తొలగించి ఇంటి వాతావరణాన్ని శాంతియుతంగా మార్చుతాయని నమ్మకం. ఈశాన్య దిశలో లేదా ప్రధాన ద్వారం వద్ద ఉంచితే దృష్టి దోషం, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు.
Also Read: Google App Changes: ఫోన్‌లో డయలర్ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి
ఆర్థిక పరంగా మంచిది
నెమలి ఈకలు అలాగే ఆర్థిక పరంగా శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా వీటిని డబ్బుల లాకర్ దగ్గర లేదా ఆర్థిక లావాదేవీలు జరిగే ప్రదేశంలో ఉంచితే సంపద పెరుగుతుందని, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని విశ్వాసం ఉంది. చదువుకునే పిల్లలకు కూడా నెమలి ఈకలు ఉపయోగపడతాయని నమ్మకం. చదువు గదిలో లేదా పిల్లల చదువుకునే టేబుల్ వద్ద ఉంచితే ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక స్పష్టత వస్తుందని చెబుతారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.
వాస్తు దోషాలను సరిచేయడంలోనూ ఇవి ప్రభావం చూపుతాయి. ఇంటి నైరుతి లేదా ఈశాన్య దిశల్లో నెమలి ఈకలు ఉంచితే శక్తుల సమతుల్యత వస్తుందని విశ్వాసం. పూజా గదిలో లేదా ధ్యాన స్థలంలో ఉంచితే ఆధ్యాత్మిక శాంతి, అంతరాత్మ బలాన్ని పెంచుతాయని చెబుతారు. ఇంట్లో సంబంధాలను బలపరచడంలోనూ నెమలి ఈకలు సహాయపడతాయి. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో నైరుతి దిశలో ఉంచితే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండుతుందని నమ్మకం. ప్రేమ, విశ్వాసం పెరుగుతాయని కూడా అంటారు. ఇవన్నీ కాకుండా, నెమలి ఈకలు ఇంటికి అద్భుతమైన అలంకరణ. వీటి రంగులు, ప్రత్యేకమైన నమూనాలు గదులకు అందాన్ని, రాజసం జోడిస్తాయి.
నెమలి ఈకలు అక్కడ పెట్టకండి
కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. వీటిని ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశాల్లోనే ఉంచాలి. ఈశాన్య లేదా దక్షిణ దిశల్లో, పూజా గదిలో, చదువు గదిలో లేదా లాకర్ వద్ద ఉంచితే మంచిదే కానీ, బాత్‌రూమ్ లాంటి అశుద్ధ ప్రదేశాల్లో మాత్రం పెట్టరాదు. సాధారణంగా కనిపించే ఈ నెమలి ఈకలు మన ఇంటికి శాంతి, సమృద్ధి, ప్రేమ, సౌందర్యం తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్నాయని హిందూ సంప్రదాయం చెబుతోంది. మనం చిన్నప్పుడే ఇష్టపడిన ఈ అందమైన ఈకలు… నిజానికి మన జీవితానికి అనేక రకాల శుభఫలితాలను అందిస్తాయని ఇప్పుడు అర్థమవుతుంది.