Rain Alert: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిపోయింది.. వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రోడ్లు కాస్త ఇప్పడిప్పుడే ఆరుతున్నాయి. వర్షాలు ఇంకా ఆగిపోయాయి అని సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే వాతావరణ శాఖ షాక్ ఇచ్చింది. మళ్లీ నేటి నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో రెయిన్ అలర్ట్..
ప్రస్తుతం ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణలు.. కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో వచ్చే వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
Also Read: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?
ఏపీలో వాతావరణం ఇలా..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాలు, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు తీవప్రాంతం అయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.