Rangareddy News: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య ఏలాంటి గొడవలు జరిగాయో తెలీదు. భర్తను చంపాలని ఎప్పటి నుంచి ప్లాన్ వేసిందో అస్సలు తెలీదు. అనుమానం రాకుండా భర్తను మట్టుపెట్టేసింది. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది భార్య. సంచలనం రేపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో వెలుగుచూసింది.
రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలోని అజీజ్‌నగర్‌కు చెందిన రాజిరెడ్డి రెండు నెలల కిందట డెయిరీ ఫామ్ ఓపెన్ చేశారు. అందులో పనిచేసేందుకు ఓ ఏజెంట్ ద్వారా బీహార్‌కు చెందిన రాకేష్ దంపతులను పని వాళ్లుగా నియమించుకున్నాడు. ఆగష్టు 21న రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌కు వెళ్లాడు. అక్కడ రాకేష్ దంపతులతోపాటు మరో వ్యక్తి కనిపించాడు.
మూడో వ్యక్తి కనిపించడంతో యజమానికి అనుమానం వచ్చింది. తమ బంధువని రాకేష్ భార్య పూనందేవి చెప్పింది. దీంతో భర్త సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత మరో రోజు పని మీద ఫామ్‌కు వెళ్లాడు రాజిరెడ్డి. రాకేష్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని పూనందేవిని అడిగాడు. తాగొచ్చి తనతో గొడవపడుతున్నాడని, ఏదో షాపుకి వెళ్లి ఉంటాడని చెప్పింది. అదే రోజు మళ్లీ సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లాడు రాజిరెడ్డి.
అక్కడ పని వాళ్లెవరూ కనిపించలేకపోవడంతో కంగారు పడ్డారు. ఫామ్‌హౌస్ చుట్టూ తిరుగుతున్న సమయంలో రాకేష్ మృతదేహం బావిలో కనిపించింది. రాకేష్-పూనందేవి దంపతులకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అయినట్టు వచ్చింది. దీంతో శనివారం ఏజెంట్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడన్నాడు. రాయితో తలపై కొట్టి చంపినట్లు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ALSO READ: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాకుతో వ్యక్తి దుర్మరణం
భర్తని భార్య హత్య చేసిందని నిర్ధారించారు. రాకేష్ దంపతులు ఉద్యోగంలో చేరిన నుంచి అన్నివిషయాలను రాజిరెడ్డి పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.