E-Paper
Advertisement

Xiaomi X Pro QLED TV: భారీ డిస్కౌంట్‌తో షావోమీ 75 ఇంచుల టీవీ లాంచ్.. 4 ఏళ్ల వారంటీ ఉచితం!

Xiaomi X Pro QLED TV: భారీ డిస్కౌంట్‌తో షావోమీ 75 ఇంచుల టీవీ లాంచ్.. 4 ఏళ్ల వారంటీ ఉచితం!
Advertisement

Xiaomi X Pro QLED TV: షావోమీ నుంచి ఇండియన్ మార్కెట్లోకి మరో భారీ టీవీ వచ్చేసింది. గతేడాది 65 అంగుళాల వరకు QLED టీవీలను తీసుకొచ్చిన షావోమీ సంస్థ.. ఇప్పుడు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఏకంగా 75 అంగుళాల భారీ స్క్రీన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని కోరుకునే వారికి, గేమింగ్ ప్రియులకు ఈ టీవీ కచ్చితంగా నచ్చుతుంది.

లాంచ్ ఆఫర్లు ఇలా..

ఈ సరికొత్త 75 ఇంచుల Xiaomi X Pro QLED TV ధరను కంపెనీ రూ.69,999గా నిర్ణయించింది. అయితే లాంచ్ ఆఫర్ కింద HDFC లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు రూ.64,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి 4 ఏళ్ల వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. అమెజాన్, ఎంఐ వెబ్‌సైట్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ టీవీ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.2,400 లోపు ‘క్రోమా 2000W ఇండక్షన్’ కుక్‌టాప్!

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ..

75 అంగుళాల 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లే ఈ టీవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీనిలో ఫిల్మ్‌మేకర్ మోడ్ ఉండటం వలన దర్శకుడు ఆ సినిమాను ఏ రంగులతో, ఏ ఫీల్‌తో చూపించాలనుకున్నారో అదే విధంగా మనకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇందులోని డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10+ వంటి ఫీచర్లు విజువల్స్ చాలా రిచ్‌గా ఉండేలా చూస్తాయి. ఇక గేమింగ్ కోసం ఈ టీవీలో 120 హెర్ట్జ్ గేమ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంది.

34 వాట్ల స్పీకర్లు..

Advertisement

ఆండ్రాయిడ్ 14 ఆధారిత గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేస్తుంది. షావోమీ సొంత ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ వల్ల OTT కంటెంట్‌ను వెతుక్కోవడం చాలా సులభం అవుతుంది. ఇక ఆడియో విషయానికి వస్తే.. ఈ టీవీలో 34 వాట్ల స్పీకర్లు ఉన్నాయి. ఇవి డాల్బీ ఆడియో సపోర్ట్‌తో వస్తాయి కాబట్టి హాల్ మొత్తం సమానమైన సౌండ్ వినిపిస్తుంది.

బడ్జెట్ ధరలో బిగ్ స్క్రీన్..

ఈ Xiaomi X Pro QLED TV 2GB RAM, 32GB స్టోరేజ్ ఉన్నాయి. అలాగే వేగవంతమైన పనితీరు కోసం క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను వాడారు. కనెక్టివిటీ కోసం 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులతో పాటు యాపిల్ ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా ఉంది. తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ టీవీ కావాలనుకుంటే దీనిని ఒకసారి పరిశీలించవచ్చు.

Also Read: ఈ వేసవిలో ఏ ఫ్యాన్ వాడటం హెల్త్‌కి మంచిది? నిపుణులు ఇస్తున్న సూచనలివే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×