Vivo Y51 Pro vs Motorola Edge 70 Fusion vs OnePlus Nord CE 5 Smartphone Comparison| ఇండియాలో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్స్ అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లోనే ఎక్కువ ఫోన్లు విడుదల చేస్తున్నాయి. చైనా బ్రాండ్ వివో తాజాగా వివో Y51 ప్రో 5G ఫోన్ ఇటీవల లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు పోటీగా మార్కెట్లో మరో కొత్త ఫోన్ మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, బెస్ట్ సెల్లింగ్ వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G ఉన్నాయి.
ఈ మూడు ఫోన్లలోనూ ఆధునిక ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, మంచి కెమెరా సిస్టమ్‌లు ఉన్నాయి. తక్కువ ధరలో బలమైన పర్‌ఫామెన్స్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ ఫోన్లు మంచి ఆప్షన్లు. ధర, డిస్‌ప్లే, పర్‌ఫామెన్స్, కెమెరా బ్యాటరీ ఆధారంగా ఈ మూడు ఫోన్లు పోల్చి చూద్దాం.
వివో Y51 ప్రో 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.27,999.
మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేరియంట్లు ఇస్తోంది. 8GB ర్యామ్ + 128GB మోడల్ ధర రూ.26,999. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.29,999. 12GB ర్యామ్ + 256GB హైయెస్ట్ వేరియంట్ ధర రూ.32,999.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G కూడా రెండు ఆప్షన్లు ఇస్తోంది. 8GB ర్యామ్ + 128GB మోడల్ ధర రూ.24,999. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.26,999.
ధర పరంగా వివో, వన్‌ప్లస్ చౌకగా ఉన్నాయి.
వివో Y51 ప్రో 5Gలో 6.75 ఇంచ్ LCD డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1570*720 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1250 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో 6.78 ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 6.77 ఇంచ్ OLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2392*1080 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్. 300Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
డిస్‌ప్లే క్వాలిటీలో Motorola ఆధిక్యంలో ఉంది.
వివో Y51 ప్రో 5Gలో మిడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ఉంది. రోజువారీ ఉపయోగం మరియు గేమింగ్ సమర్థవంతంగా నడుస్తాయి.
మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ఉంది. బలమైన పనితీరు మరియు బ్యాటరీ ఎఫిషియెన్సీ బాగుంటాయి.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో మిడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. 4nm ఆర్కిటెక్చర్ వల్ల అద్భుతమైన పనితీరు ఇస్తుంది.
మూడు ఫోన్లు మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు బాగా సరిపోతాయి.
వివో Y51 ప్రో 5G ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా Hello UI ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OxygenOS 15 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
మూడు ఇంటర్‌ఫేస్‌లు స్మూత్ నావిగేషన్ మరియు ఆధునిక ఫీచర్లు ఇస్తాయి.
వివో Y51 ప్రో 5Gలో డ్యూల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో 50MP మెయిన్ (OIS) + 13MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 50MP మెయిన్ (OIS) + 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
Motorola కెమెరా వెర్సటైల్‌గా ఉంది.
వివో Y51 ప్రో 5Gలో 7200mAh పెద్ద బ్యాటరీ ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో 7000mAh బ్యాటరీ ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో 7100mAh బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
వివోలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంది.
ఈ మూడు ఫోన్లలోనూ బలమైన స్పెసిఫికేషన్స్, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో డిస్‌ప్లే, కెమెరా వెర్సటైలిటీ బెస్ట్‌గా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ CE 5 5Gలో పర్‌ఫామెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ బాగున్నాయి. వివో Y51 ప్రో 5G లో అతి పెద్ద బ్యాటరీ ఉంది. మీ అవసరం, ప్రాధాన్యతల ఆధారంగా సరైన ఫోన్ ఎంచుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఆయా బ్రాండ్ కంపెనీలు ఇచ్చే ఆఫర్ల ఆధారంగా ఉంటాయి. మీరు తగిన ఫోన్ కొనుగోలు చేసేముందు చెక్ చేసుకోవాలని సూచన. పైన పేర్కొన్న ఫోన్ ధరలు.. మీరు కొనుగోలు చేసే సమయానికి మారి ఉండవచ్చు. ఈ వివరాలన్నీ పాఠకుల అవగాహన కోసమే. ‘బిగ్ టీవీ’ ధరల మార్పుల విషయంలో బాధ్యత వహించదు.