E-Paper
Advertisement

కాలం మారిందోచ్.. ఇక వర్షాకాలంలో వెచ్చగా ఉంచే.. టాప్ 5 ఏసీలు ఇవే..!

కాలం మారిందోచ్.. ఇక వర్షాకాలంలో వెచ్చగా ఉంచే.. టాప్ 5 ఏసీలు ఇవే..!

Monsoon ACs: ఒకప్పుడు ఏసీ అంటే కేవలం ఎండకాలంలోనే వాడేవాళ్లు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఏసీలు కేవలం చల్లదనాన్నే కాకుండా.. చలికాలం, వర్షాకాలంలో గదిని వెచ్చగా కూడా ఉంచుతున్నాయి. వీటినే ‘హాట్ అండ్ కోల్డ్’ (Hot & Cold) ఏసీలుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం జూన్ నెలలోకి అడుగుపెట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరుజల్లులు మెుదలయ్యాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు సైతం కురవనున్నాయి. ఇలాంటి సమయంలో వెచ్చదనాన్ని ఇస్తూ.. గదిని పొడిగా ఉంచే టాప్ 5 ఏసీల లిస్ట్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

ఎల్‌జీ 1.5 టన్ 3 స్టార్ హాట్ అండ్ కోల్డ్ ఏసీ

ఎల్‌జీ బ్రాండ్ కు చెందిన ఈ ఏసీ.. ‘డ్యూయల్ ఇన్వర్టర్’ టెక్నాలజీని కలిగి ఉంది. వర్షాకాలంలో గదిలోని తేమను తగ్గించడానికి ఇందులో ప్రత్యేకంగా ‘మన్‌సూన్ కంఫర్ట్’ ఫీచర్ ఉంది. ఇది చలికాలంలో గదిని చాలా త్వరగా వెచ్చగా మారుస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పైగా విద్యుత్ ను సైతం చాలా పొదుపుగా వినియోగిస్తుందని పేర్కొన్నాయి.

డైకిన్ 1.5 టన్ 5 స్టార్ హాట్ అండ్ కోల్డ్ ఏసీ

ఏసీల మార్కెట్లో డైకిన్‌ కంపెనీకి మంచి గుడ్ విల్ ఉంది. ఈ 5 స్టార్ ఏసీలో ఉండే వినూత్న టెక్నాలజీ వల్ల బయట వాతావరణం ఎలా ఉన్నా.. గది లోపల మనకు కావలసినంత వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని స్థిరంగా అందిస్తూ ఉంటుంది. దీని వల్ల గది వాతావరణం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

వోల్టాస్ 1.5 టన్ ప్యూర్ ఎయిర్ ఏసీ

దేశీయ బ్రాండ్ అయిన వోల్టాస్.. తక్కువ బడ్జెట్‌లో ఈ అద్భుతమైన ఆల్ రౌండర్ ఏసీని తీసుకొచ్చింది. ఈ హాట్ అండ్ కోల్డ్ ఏసీ గదిని వెచ్చగా ఉంచడమే కాకుండా.. ఇందులోని ‘ప్యూర్ ఎయిర్’ ఫిల్టర్లు వర్షాకాలంలో వచ్చే బ్యాక్టీరియా, దుర్వాసనలను దూరం చేస్తుంది. తద్వారా స్వచ్ఛమైన గాలిని గది నిండా నింపేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ

మంచి స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఏసీని కోరుకుంటే ఈ పానాసోనిక్ మోడల్ ను ట్రై చేయవచ్చు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేలోపే మొబైల్ యాప్ ద్వారా రూమ్‌ను వెచ్చగా సెట్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో వచ్చే తేమ వాతావరణాన్ని పోగొట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. పైగా 5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల పవర్ బిల్లు కూడా చాలా తక్కువగానే రానుంది.

Also Read: వానలు వచ్చేస్తున్నాయ్.. ఏసీలో ఈ సెట్టింగ్స్ మారిస్తే.. ఇక వర్షాకాలంలోనూ హాయిగా ఉండొచ్చు!

బ్లూ స్టార్ 1.5 టన్ హాట్ అండ్ కోల్డ్ ఏసీ

అత్యుత్తమ నాణ్యత, మెరుగైన పర్ ఫార్మెన్స్ కోరుకునేవారికి బ్లూ స్టార్ ఏసీలు బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తాయి. తీవ్రమైన చలిని సైతం తట్టుకుని గదిని వెచ్చదనంతో ఇవి నింపేస్తాయి. దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ గదికి ప్రీమియం లుక్ ను తీసుకువస్తాయని బ్లూస్టార్ వర్గాలు తెలిపాయి.

Also Read: కొత్త ఏసీ కొంటున్నారా? ఏఐ ఏసీ vs నార్మల్ ఏసీ.. ఏది బెస్ట్ ఛాయిస్?

Tags

Related News

యూట్యూబ్ షార్ట్స్ vs ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎక్కువ డబ్బులు దేంట్లో వస్తాయంటే?

షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!

iPhone 18 Proలో భారీ మార్పులు.. లాంచ్‌కు ముందే బ్యాటరీ, డిస్‌ప్లే ఫీచర్లు లీక్.. ధర కూడా పెరగనుందా?

వానలు వచ్చేస్తున్నాయ్.. ఏసీలో ఈ సెట్టింగ్స్ మారిస్తే.. ఇక వర్షాకాలంలోనూ హాయిగా ఉండొచ్చు!

OnePlus 13 నుంచి Nord సిరీస్ వరకు భారీ ఆఫర్లు.. జూన్ 10 వరకు బంపర్ డిస్కౌంట్స్!

కొత్త ఏసీ కొంటున్నారా? ఏఐ ఏసీ vs నార్మల్ ఏసీ.. ఏది బెస్ట్ ఛాయిస్?

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

Big Stories

×