E-Paper
Advertisement

PAK VS AUS: ఆస్ట్రేలియాపై భారీ విజ‌యం…పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PCB బంప‌ర్ ఆఫ‌ర్

PAK VS AUS: ఆస్ట్రేలియాపై భారీ విజ‌యం…పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PCB బంప‌ర్ ఆఫ‌ర్
Advertisement

PAK VS AUS: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య 3 వన్డేల సిరీస్ (Australia tour of Pakistan 2026) నిన్నటితో ముగిసింది. పాకిస్తాన్ గడ్డపై జరిగిన ఈ వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన షాహీన్ అఫ్రిది సేన, 3 వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో 3 వన్డేలు జరగగా…2-1 తేడాతో టైటిల్ దక్కించుకుంది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board). ఆస్ట్రేలియాపై గెలిచినందుకు 54 రోజుల పాటు హాలిడే ప్రకటించింది. ఈ 54 రోజుల పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో మ్యాచ్ ఫినిష్ కాగానే, లాహోర్ నుంచి పాకిస్తాన్ క్రికెటర్లందరూ తమ ఇంటికి వెళ్లిపోయారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

ఆస్ట్రేలియాపై భారీ విజ‌యం…పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PCB బంప‌ర్ ఆఫ‌ర్

Advertisement

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ పూర్తయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ విరామం లభించనుంది. 54 రోజుల పాటు పాకిస్తాన్ ప్లేయర్లు ( NO PAKISTAN CRICKET FOR 54 DAYS) ఎలాంటి క్రికెట్ లేకుండా… హాలిడే ఎంజాయ్ చేయనున్నారు. అంటే దాదాపు రెండు నెలలపాటు పాకిస్తాన్ క్రికెటర్లు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చన్నమాట. మళ్లీ జూలై 25వ తేదీ నుంచి మైదానంలో అడుగుపెట్టనున్నారు. వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జూలై 25వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటివరకు పాకిస్తాన్ క్రికెటర్లు ఎంజాయ్ చేయమన్నారు. అయితే ఈ 54 రోజుల పాటు ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసేలా… ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్లేయర్ లందరికీ ఇచ్చిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ తో పాటు టి20 సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఈ ఆఫర్ ఇచ్చారట. దీంతో ప్లేయర్లు ఇవాల్టి నుంచి 54 రోజులపాటు చిల్ కాబోతున్నారు.

సొంత గడ్డపై ఇరగదీసిన పాకిస్తాన్

సొంత గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు ( PCB) ఇరగదీసింది. ఆశయ్యతో జరిగినా 3 వన్డేల సిరీస్ లో అద్భుతంగా రాణించింది పాకిస్తాన్. ఇందులో మొదటి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో మాత్రం ఆస్ట్రేలియా ఇరగదీసింది. ఇక నిన్న ఇదే స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఇందులో పాకిస్తాన్ దుమ్ము లేపింది. ఆస్ట్రేలియా పై 4 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఈ క్రమంలో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.  అయితే మ‌రికొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా C జట్టుపై విజ‌యం సాధించింద‌ని కౌంట‌ర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

Related News

కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

Big Stories

Advertisement
×