E-Paper
Advertisement

‘లండన్ ఐ’ తరహాలో ‘అమరావతి ఐ’.. కృష్ణా తీరంలో కళ్లు చెదిరే జెయింట్ వీల్ నిర్మాణం!

‘లండన్ ఐ’ తరహాలో ‘అమరావతి ఐ’.. కృష్ణా తీరంలో కళ్లు చెదిరే జెయింట్ వీల్ నిర్మాణం!
Advertisement

Amaravati Giant Observation Wheel: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన లండన్ ఐ తరహాలో అమరావతి ఐ పేరుతో భారీ అబ్జర్వేషన్ వీల్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.

లండన్ ఐ తరహాలో డిజైన్..

లండన్ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన లండన్ ఐ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే తరహా డిజైన్‌ తో అమరావతిలో కూడా భారీ వీల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి కొత్త ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

కృష్ణానది తీరంలో నిర్మాణం

Advertisement

అమరావతి ఐను కృష్ణా నది తీరంలో నిర్మించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) పరిధిలోని సుమారు ఆరు ఎకరాల భూమిని కేటాయించనున్నారు. నది ఒడ్డున ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వల్ల సందర్శకులకు అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఈ భారీ అబ్జర్వేషన్ వీల్‌ లో ప్రత్యేక క్యాప్సూల్స్ ఏర్పాటు చేస్తారు. వీటిలో కూర్చొని సందర్శకులు ఎత్తుకు వెళ్లి అమరావతి నగర అందాలు, కృష్ణా నది ప్రవాహం, పరిసర ప్రాంతాల సహజ సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నగర లైటింగ్ మధ్య ఈ ఎక్స్ పీరియెన్స్ మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశముంది.

డీబీఎఫ్‌వోటీ విధానంలో నిర్మాణం

ప్రభుత్వం ఈ ప్రాజెక్టును డీబీఎఫ్‌వోటీ (Design, Build, Finance, Operate and Transfer) విధానంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంలో ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టును రూపొందించి, నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చి, నిర్ణీత కాలం పాటు మెయింటెనెన్స్ చేస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాయి. అమరావతి ఐ ప్రాజెక్టును 30 ఏళ్ల కాలపరిమితితో అమలు చేసేలా టెండర్లు పిలవనున్నారు.

అమరావతిలో పర్యాటక రంగానికి కొత్త ఊపు

Advertisement

ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో పర్యాటక రంగానికి కొత్త ఊపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ, విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడం, పర్యాటక ఆదాయాన్ని పెంపొందించడం వంటి ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టులు నగర అభివృద్ధికి తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. లండన్ ఐ తరహాలో రూపొందనున్న అమరావతి ఐ పూర్తయితే,  కేవలం వినోద కేంద్రంగా మాత్రమే కాకుండా అమరావతి నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Read Also: 443 అడుగుల ఎత్తులో లండన్ అందాలు.. యూకే వెళ్లే వాళ్లు అస్సలు మిస్సవ్వొద్దు!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×