Best Laptops for Work From Home: ప్రస్తుత రోజుల్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ లేదా హైబ్రిడ్ వర్క్ మోడల్స్ అందిస్తున్నాయి. ఇంట్లో కూర్చుని ఆఫీస్ పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగాలంటే బెస్ట్ ల్యాప్‌టాప్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కువ సమయం జూమ్ కాల్స్ మాట్లాడాలన్నా,.. భారీ ఫైల్స్‌తో వర్క్ చేయాలన్నా ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. అందుకే రిమోట్ ఉద్యోగుల కోసం మార్కెట్లో బెస్ట్ రేటింగ్‌తో దూసుకుపోతున్న 5 అద్భుతమైన ల్యాప్‌టాప్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫీస్ పనుల కోసం వాడే ల్యాప్‌టాప్‌లకు హెవీ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల లాంటి భారీ గ్రాఫిక్స్ కార్డులు అవసరం లేదు. కానీ వాటిలో మల్టీటాస్కింగ్ , వెబ్ క్యామ్ క్వాలిటీ, కీబోర్డ్ కంఫర్ట్, కళ్ళపై ఒత్తిడి పడకుండా ఉండే మంచి డిస్‌ప్లే చాలా ముఖ్యం. ప్రస్తుతం జనం ఎక్కువగా ఇష్టపడుతున్న టాప్ 5 మోడల్స్ ఇవే..
1. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (Apple MacBook Air – M2/M3):
రిమోట్ వర్క్ చేసేవారికి ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఒక అల్టిమేట్ ఛాయిస్. ఇందులో ఉండే కస్టమ్ సిలికాన్ చిప్స్ వల్ల పర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 15 నుంచి 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. పదే పదే పవర్ కట్ అయ్యే ఏరియాల్లో ఉండే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని డిస్‌ప్లే క్వాలిటీ , ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా ఆన్‌లైన్ మీటింగ్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి.
2. డెల్ ఇన్‌స్పిరాన్ 14 (Dell Inspiron 14):
విండోస్ ల్యాప్‌టాప్స్ ఇష్టపడేవారికి, బడ్జెట్ పరిధిలో డెల్ ఇన్‌స్పిరాన్ సిరీస్ చాలా నమ్మకమైంది. లేటెస్ట్ ఇంటెల్ కోర్ i5 లేదా ఏఎమ్‌డీ రైజెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ఆఫీస్ అప్లికేషన్లు, ఎక్సెల్ షీట్లు, కోడింగ్ సాఫ్ట్‌వేర్లను సింపుల్‌గా రన్ చేస్తుంది. దీని 14 ఇంచుల కాంపాక్ట్ సైజ్ వల్ల ఇంట్లో ఎక్కడికైనా సింపుల్‌గా క్యారీ చేయవచ్చు. ఇందులో యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే ఉండటం వల్ల ఎక్కువ సమయం స్క్రీన్ చూసినా కళ్ళు అలసిపోవు.
3. హెచ్‌పీ పెవిలియన్ 15 (HP Pavilion 15):
ఎక్కువ స్క్రీన్ స్పేస్ కావాలనుకునే.. వారికి హెచ్‌పీ పెవిలియన్ 15 ఇంచుల మోడల్ చాలా బాగుంటుంది. ఫుల్ సైజ్ కీబోర్డ్ , డెడికేటెడ్ న్యూమరిక్ ప్యాడ్ ఉండటం వల్ల డేటా ఎంట్రీ, అకౌంటింగ్ పనులు చేసే ఉద్యోగులకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో 16జీబీ ర్యామ్ (RAM), ఫాస్ట్ ఎస్‌ఎస్‌డీ (SSD) స్టోరేజ్ ఉన్న మోడల్‌ను ఎంచుకుంటే ఎన్ని బ్రౌజర్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా ల్యాప్‌టాప్ అస్సలు లాగ్ అవ్వదు.
4. లెనోవో థింక్‌ప్యాడ్ ఈ14 (Lenovo ThinkPad E14):
కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్ లెనోవో థింక్‌ప్యాడ్. ఇది చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. అంతే కాకుండా దీని కీబోర్డ్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ మార్కెట్లోనే బెస్ట్ గా ఉంటుంది. కాబట్టి రోజంతా టైప్ చేసే కంటెంట్ రైటర్స్, డెవలపర్స్‌కు ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. డేటా సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్‌ప్రింట్ రీడర్ , వెబ్‌క్యామ్ ప్రైవసీ షట్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: కరెంట్ బిల్లు సేవింగ్స్ ఓకే.. BLDC ఫ్యాన్ పాడైతే ఎంత ఖర్చవుతుంది?
5. ఆసుస్ వివోబుక్ 15 (Asus Vivobook 15):
మీ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి.. బెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటే ఆసుస్ వివోబుక్ బెస్ట్. తక్కువ ధరలోనే ఇది ప్రీమియం లుక్‌తో వస్తుంది. రోజువారీ ఆఫీస్ టాస్క్‌లు, మెయిల్స్ చెక్ చేయడం, వర్చువల్ మీటింగ్స్ వంటి పనులకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది.
కొనేముందు గమనించాల్సిన చిన్న టిప్:
వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ల్యాప్‌టాప్ కొనేటప్పుడు కనీసం 8జీబీ లేదా వీలైతే 16జీబీ ర్యామ్, అలాగే కంపల్సరీగా ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఉండేలా చూసుకోవాలి. పాత హెచ్‌డీడీ స్టోరేజ్ ఉన్న ల్యాప్‌టాప్‌లు చాలా స్లోగా పనిచేస్తాయి. పైన పేర్కొన్న 5 ల్యాప్‌టాప్‌లు మీ ఆఫీస్ పనులను స్మార్ట్‌గా, వేగంగా పూర్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి