E-Paper
Advertisement

Inzamam-ul-Haq: అంతే ఫిక్సింగే..కావాల‌నే వికెట్ల‌ను సాయి సుద‌ర్శ‌న్ కొట్టుకున్నాడు !

Inzamam-ul-Haq:  అంతే ఫిక్సింగే..కావాల‌నే వికెట్ల‌ను సాయి సుద‌ర్శ‌న్ కొట్టుకున్నాడు !
Advertisement

Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Qualifier 1) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు, ఏకంగా 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ (Sai Sudharsan hit wicket) కావడంపై పెద్ద కాంట్రవర్సీ నెలకొంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది ఔట్ కాదని కొందరు అంటుంటే.. క్లియర్ ఔట్ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

అంతే ఫిక్సింగే..కావాల‌నే వికెట్ల‌ను సాయి సుద‌ర్శ‌న్ కొట్టుకున్నాడు

Advertisement

మొదటి క్వాలిఫైయర్ సందర్భంగా సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన సంఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam-ul-Haq) కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఐపీఎల్ క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ ను మొత్తం చూసినట్లు వివరించారు. దీంతో ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని తనకు అర్థమైనట్లు ఆరోపణలు చేశారు. టోర్నమెంట్ మొత్తంలో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా ఆడారని.. కానీ బెంగుళూరు బ్యాటర్లకు స్లోగా బంతులు సంధించినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇక సాయి సుదర్శన్ అయితే కావాలనే వికెట్లను కొట్టుకున్నాడని బాంబు పేల్చారు ఇంజమామ్. బెంగళూరు తో ఫిక్సింగ్ చేసుకున్నాడు కాబట్టే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని సీరియస్ అయ్యారు. అంతకుముందు ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణించి.. ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న సాయి సుదర్శన్ ను బెంగళూరు కొనేసిందని ఆరోపణలు చేశారు.

గుజ‌రాత్ బౌల‌ర్లు స్లోగా బౌలింగ్ చేశారు

వాస్తవానికి సాయి సుదర్శన్ కూడా నాటౌట్ అని ఇంజమామ్ కూడా తెలిపారు. అంపైర్ అనిల్ చౌదరీ చెప్పినట్లుగానే.. షాట్ ఆడిన తర్వాత స‌ద‌రు బ్యాటర్ క్యాప్, బ్యాట్, గ్లోవ్స్ వికెట్లను తగిలితే నాటౌట్ గా పరికరించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిక్సింగ్ జరిగింది కాబట్టి దీనిపై రివ్యూ తీసుకోకుండానే సాయి సుదర్శన్ పెవిలియన్ కు వెళ్ళిపోయాడు అని మండిపడ్డారు. మొదటినుంచి తాము ఇదే చెబుతున్నామని.. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ లీగ్ అంటూ బాంబు పేల్చాడు. దీంతో పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న గెలిచిన బెంగుళూరు ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది. మే 31వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో బెంగళూరుకు ఫైనల్ జరుగుతుంది. నిన్న ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్, హైదరాబాద్ లేదా రాజస్థాన్ రెండింటిలో ఒక జట్టుతో క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ ఆడుతుంది.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

 

Related News

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

ధోని మాములోడు కాదురా….2007లో పాకిస్తాన్ ను వెర్రి పుష్పాల‌ను చేశాడు

టెస్టులు, వ‌న్డేల‌కు బుమ్రా ప‌నికిరాడు…వెళ్లి ఐపీఎల్ ఆడుకోరా !

Big Stories

Advertisement
×