Asghar Afghan: పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ (Pakistan vs Afghanistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇండియాతో పదే పదే గొడవ పెట్టుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కూడా గెలుకుతోంది. రెండు దేశాల మధ్య ఎప్పుడు గొడవ జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు కూడా వెనుకడుగు వేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు (Pakistan Super League tournament) కూడా గుడ్ బై చెప్పేసారు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు. కేవలం ఐపిఎల్ టోర్నమెంట్ లో కొనసాగుతూ.. ఇండియాతో బంధం పెంచుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరువు తీస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ ఆఫ్ఘన్ ( Asghar Afghan). బాబర్ ఆజం కంటే రెహ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz ) 1000 రెట్లు బెస్ట్ ప్లేయర్, మా వాడిది కోహ్లీ రేంజ్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరువు తీసేలా ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ ఆఫ్ఘన్ ( Asghar Afghan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ రేంజ్ అన్నట్లుగా బాబర్ ఆజం తెగ బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. కానీ ఆఫ్గనిస్తాన్ ఓపెనర్ హ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz ) ముందు బాబర్ ఆజం దేనికి పనికిరాడు అని పరువు తీశారు. ఓపెనర్ గా వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఎన్నోసార్లు విజయ తీరాలకు చేర్చాడని ప్రశంసించారు. మొన్న టీమిండియా పై కూడా సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి హ్మానుల్లా గుర్బాజ్ (Rahmanullah Gurbaz ) ను విరాట్ కోహ్లీతో సమానంగా చూడాలని వ్యాఖ్యానించారు. బాబర్ ఆజం కంటే వెయ్యి రేట్లు మావాడు గొప్పవాడని పేర్కొన్నారు. కానీ ఈ విషయం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువగా అంచనా వేసి మాట్లాడుతూ ఉంటారని చురకలు అంటించారు. గతంలో కూడా పాకిస్తాన్ జట్టును ఓడించిన దాఖలాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఆఫ్గనిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు రెహ్మానుల్లా గుర్బాజ్. ప్రస్తుతం వికెట్ కీపర్ గా ఉన్న రెహ్మానుల్లా గుర్బాజ్.. ఓపెనర్ గా కూడా దిగుతున్నాడు. 2021 సంవత్సరంలో ఐర్లాండ్ తో జరిగిన వన్డేలో అరంగేట్ర మ్యాచ్ సందర్భంగా సెంచరీ చేశాడు. అప్పుడు అతని వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. 2024 టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టును సెమీ ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. టీమిడియాపై 48 బంతుల్లోనే మొన్న సెంచరీ చేసి మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు తరఫున ఆడాడు.