Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. చెన్నైని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ (ishan kishan)… చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను దారుణంగా ర్యాగింగ్ చేశాడు. విజిల్ వేస్తూ (ishan kishan whistle celebration).. ఇక మీ పని అయిపోయింది రా.. స్టేడియం నుంచి వెళ్లిపోండి అంటూ ఆడుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ చేసిన సెలబ్రేషన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతుంటే… మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) మాత్రం భిన్నంగా స్పందించారు. ఇషాన్ కిషన్ కు సపోర్ట్ గా నిలిచారు.
ఇషాన్ కిషన్ విజిల్ వేస్తూ సెలబ్రేషన్స్ చేసిన సంఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు తగిన బుద్ధి చెప్పావని ఇషాన్ కిషన్ ను మెచ్చుకునే ప్రయత్నం చేశారు. విజిల్ కాదు.. ఆ వెధవలను చెంపదెబ్బలు కొట్టిన తప్పు లేదంటూ వ్యాఖ్యానించారు వీరేంద్ర సెహ్వాగ్. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఓవరాక్షన్ చేస్తారని వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. ఆ స్టేడియంలో అడుగుపెట్టిన నుంచి మ్యాచ్ అయిపోయే వరకు ఈలలు వేస్తూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తారన్నారు. ఆ శబ్దంతో మనందరికీ చికాకు వస్తుందని పేర్కొన్నారు. అందుకే తిక్క రేగిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అదే విజిల్ వేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను తరిమికొట్టాడని వ్యాఖ్యానించారు.
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు సరైన బుద్ధి చెప్పాడని ఇశాన్ కిషన్ ను వెనుకేసుకు వచ్చారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ర్యాగింగ్ చేసినందుకుగాను ఇషాన్ కిషన్ పై వేటు వేసే ప్రమాదం పొంచి ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. విజిల్ వేస్తూ వాళ్లందరినీ టార్చర్ చేశారని ఇప్పటికే బీసీసీఐకి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసిందట. ఒకవేళ రంగంలోకి బీసీసీఐ దిగితే… కిషన్ కిషన్ పై భారీ ఫైన్ పడే ప్రమాదం పొంచి ఉంది. కాగా ఈ మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ కు ఇషాన్ కిషన్ చుక్కలు చూపించాడు.
Also Read: Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్
Virender Sehwag on ishan kishan whistle celebration 🎙️:
"I can understand where it's coming from I have been to Chepauk and the crowd whistles nonstop like It's their only job, anyone can get irritated by that ishan's celebration was completely fine."
Sehwag backing kishan 👏🏻 pic.twitter.com/SQsdtNmWBy
— Dive (@crickohliic) May 19, 2026