E-Paper
Advertisement

విదేశాలకు వెళ్తున్నారా? ‘వీఐ’ నుంచి అదిరిపోయే రోమింగ్ ప్లాన్స్.. రూ. 649 నుంచే ప్రారంభం!

విదేశాలకు వెళ్తున్నారా? ‘వీఐ’ నుంచి అదిరిపోయే రోమింగ్ ప్లాన్స్.. రూ. 649 నుంచే ప్రారంభం!
Advertisement

Vi Roaming Plans: వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) తీపి కబురు అందించింది. తమ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ప్లాన్లు కేవలం రూ. 649 ప్రారంభ ధర నుంచే లభించనున్నాయి. విదేశాల్లో పర్యటించే భారతీయులకు ఎలాంటి బిల్లుల భారం పడకుండా.. పూర్తి పారదర్శకతతో కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ‘విఐ’ ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ఒక్కొక్కరి పర్యటన సమయం ఒక్కోలా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ‘విఐ’ సంస్థ ఈసారి సరికొత్తగా 7 రోజుల, 14 రోజులు, 21 రోజుల కాలపరిమితి (Validity) గల ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటితో కలిపి ప్రస్తుతం ‘విఐ’ వద్ద 1 రోజు నుండి మొదలుకొని 30 రోజుల కాలపరిమితి వరకు మొత్తం 17 విభిన్నమైన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి.

41 దేశాల్లో అన్‌లిమిటెడ్ డేటా

Advertisement

ఈ కొత్త రోమింగ్ ప్లాన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాలలో కస్టమర్లు డేటా, వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS) సేవలను పొందవచ్చని వీఐ తెలిపింది. అయితే దాదాపు 41 ప్రధాన దేశాలలో ఎంపిక చేసిన ప్రీమియం ప్లాన్లపై ఎలాంటి పరిమితులు లేని ‘ట్రూలీ అన్‌లిమిటెడ్’ (Truly Unlimited) డేటా, వాయిస్ కాల్స్ ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. దేశంలో ఈ తరహా అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్ తామేనని వీఐ సంస్థ ధీమా వ్యక్తం చేసింది. మిగిలిన దేశాలలో నిర్ణీత పరిమితితో కూడిన డేటా, టాక్‌టైమ్ లభిస్తాయని చెప్పుకొచ్చింది.

ప్రారంభ ప్లాన్లు ఎలా ఉన్నాయంటే?

వీఐ తీసుకొచ్చిన రోమింగ్ ప్లాన్స్ లో రూ.649 ప్లాన్ అత్యంత చౌకైనది. ఇది ఒక రోజూ వ్యాలిడిటీతో రూపొందింది. దీని ద్వారా కస్టమర్లకు 1GB డేటా, 150 నిమిషాల వాయిస్ కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. ఒకవేళ ఒక్కరోజు పర్యటనలో ఎక్కువ డేటా కోరుకుంటే వీఐ అందిస్తున్న రూ.749 ప్లాన్ ట్రై చేయవచ్చు. ఈ ప్లాన్ కింద ఎంపిక చేసిన 41 దేశాలలో అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ లభిస్తాయి. ఇక 7 రోజుల వ్యాలిడితీ రూ.2.649 రోమింగ్ ప్లాన్ సైతం వీఐ ఆఫర్ చేస్తోంది. ఇది ప్రతీరోజూ 2GB డేటా, 300 నిమిషాల టాక్‌టైమ్, 100 ఎస్ఎమ్ఎస్‌లను అందిస్తుంది. వారం రోజులకు అన్‌లిమిటెడ్ డేటా కావాలంటే రూ. 3,649 ప్లాన్ అందుబాటులో ఉంది. అటు 21 రోజుల ప్లాన్లు రూ. 3,799 నుండి రూ. 5,699 ధరల్లో లభిస్తున్నాయి.

Advertisement

Also Read: ‘కెనడియన్ బావి’ వింత.. పెరట్లో పైపులు పాతి.. ఇల్లంతా కూల్‌గా మార్చేశాడు!

యాక్టివేషన్ చాలా సులువు

ఈ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను పొందడం కోసం కస్టమర్లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా తమ మొబైల్‌లోని ‘Vi App’ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుని.. ప్రయాణ తేదీల ప్రకారం సులభంగా డిజిటల్ పద్ధతిలో యాక్టివేట్ చేసుకోవచ్చు. విదేశాల్లో లోకల్ సిమ్ కార్డులు కొనడం, పబ్లిక్ వై-ఫై ద్వారా సైబర్ ప్రమాదాలకు గురికావడం వంటి ఇబ్బందులు లేకుండా.. తమ సొంత నంబర్‌తోనే సురక్షితంగా బ్యాంకింగ్ ఓటీపీలు, కాల్స్ అందుకోవడానికి ఈ ప్లాన్లు ఎంతో ఉపయోగపడతాయని ‘విఐ’ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×