Pakistan vs India Test series proposed by PCB Chairman Mohsin Naqvi: పాకిస్తాన్ వర్సెస్ ఇండియా (Pakistan vs India ) మధ్య 2008 నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు రద్దయిన సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చాలా సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దొంగ చాటున ఇండియాలోకి ప్రవేశించి చాలా సార్లు పాకిస్తాన్ కుట్రలకు తెర లేపింది. ఇక మొన్నటికి మొన్న పహాల్గామ్ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దూరం మరింత పెరిగింది.
ఐసీసీ టోర్నమెంట్స్ లో భాగంగా మ్యాచ్ లు జరిగితే షేక్ హ్యాండ్ (IND VS PAK Handshake) కూడా పాకిస్తాన్ వాళ్లకు ఇవ్వడం లేదు మన ఇండియన్స్. అయితే ఈ నేపథ్యంలో ఇండియాకు దగ్గర అయ్యేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (PCB Chairman Mohsin Naqvi) కొత్త కుట్రలకు తెర లేపారు. ఇందులో భాగంగానే ఇండియాతో టెస్ట్ సిరీస్ ఆడుదామని… ఓ ప్రపోజల్ కూడా పంపారు. గొడవలు మర్చిపోయి, మాతో టెస్ట్ సిరీస్ ఆడండి అంటూ బీసీసీఐకి కీలక సూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs India ) మధ్య టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (PCB Chairman Mohsin Naqvi) ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకునేందుకుగాను… ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు బీసీసీఐ పెద్దలతో కూడా రహస్యంగా సమావేశం అయ్యారట. రాజీవ్ శుక్లా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కూడా చెబుతున్నారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరిగినప్పుడే ఈ రహస్య సమావేశం జరిగినట్లు ఇంగ్లీష్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే పాకిస్తాన్ ప్రతిపాదనలు విన్న.. బీసీసీఐ పెద్దలు… భారత సర్కార్ నిర్ణయమే తమ నిర్ణయమని వెల్లడించారు. దీనిపై మోడీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వివరించారట. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పెను సంచలనమే అవుతుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరిగి టెస్టు సిరీస్ జరిగితే మాత్రం… ఈ ఏడాది చివరలో మ్యాచులు జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు నిర్వహించే ఛాన్స్ ఉంటుంది.