E-Paper
Advertisement

క్రిస్టల్ గ్లాసెస్ To బిగ్ డిస్‌ ప్లే .. కొత్త ఆల్పినా స్పెషల్ ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

క్రిస్టల్ గ్లాసెస్ To బిగ్ డిస్‌ ప్లే .. కొత్త ఆల్పినా స్పెషల్ ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
Advertisement

BMW Alpina Vision Concept Features: BMWకు చెందిన లగ్జరీ సబ్ బ్రాండ్ ఆల్పినా తాజాగా కొత్త విజన్ గ్రాండ్ టూరర్ కాన్సెప్ట్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కాన్సెప్ట్ కారు ద్వారా ఫ్యూచర్ లో ఆల్పినా కార్లు ఎలా ఉండబోతున్నాయో చూపించింది. కొత్త విజన్ గ్రాండ్ టూరర్ కాన్సెప్ట్‌ నుంచి నేరుగా ప్రొడక్షన్ కారు రాకపోయినా, భవిష్యత్ ఆల్పినా మోడళ్ల డిజైన్ ఎలా ఉండబోతుందో ఈ ప్రోటోటైప్ ద్వారా అర్థమవుతోంది. BMW ప్రస్తుతం ఆల్పినాను ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌ లో ఓ రేంజ్ కు తీసుకెళ్లాలని భావిస్తోంది. ధరల పరంగా ఈ కార్లు సాధారణ BMW కార్ల కంటే ఎక్కువ కాస్ట్ తో  ఉండగా, రోల్స్ రాయిస్ కంటే కొంచెం తక్కువ ధరలో ఉండనున్నాయి.

5.2 మీటర్ల పొడవు.. 2+2 సీటింగ్ లేఅవుట్‌

ఈ కాన్సెప్ట్ కారు మొత్తం 5.2 మీటర్ల పొడవుతో 2+2 సీటింగ్ లేఅవుట్‌లో రూపొందించారు. ముందు భాగంలో ఆల్పినా ప్రత్యేకమైన షార్క్ నోస్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే సన్నని గ్రిల్‌ కు క్లాసిక్ BMW 507 మోడల్ నుంచి ప్రేరణ తీసుకున్నారు. డేటైమ్ రన్నింగ్ లైట్లు వార్మ్ వైట్ కలర్‌ లో ఉండగా, హెడ్‌ ల్యాంప్‌ లలో క్రిస్టల్ లాంటి డిజైన్‌ ను ఉపయోగించారు. బయట క్లాసిక్ ఆల్పినా స్టైల్‌ను కొనసాగించారు. 22 అంగుళాల ముందు వీల్స్‌, 23 అంగుళాల వెనుక వీల్స్‌, 20 స్పోక్ డిజైన్‌, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. ఆల్పినా బ్రాండ్‌ కు గుర్తుగా ఉండే స్ట్రైప్స్‌ ను కూడా కొత్త స్టైల్‌ లో అందించారు.

కంప్లీట్ ప్రీమియం ఇంటీరియర్

Advertisement

ఈ కాన్సెప్ట్ కారు పూర్తిగా ప్రీమియం ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది. డార్క్, లైట్ టోన్‌ లతో డ్యూయల్ కలర్ క్యాబిన్‌ ను రూపొందించారు. ఫుల్ గ్రెయిన్ లెదర్ సీట్లు, వుడ్ ఫినిష్‌, మెటల్ డీటైలింగ్‌ క్యాబిన్‌ ను మరింత లగ్జరీగా మార్చాయి. స్టీరింగ్ వీల్ మధ్యలో కొత్త ఆల్పినా లోగో కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పెద్ద డిజిటల్ డిస్‌ ప్లే, ప్రత్యేక ప్యాసింజర్ స్క్రీన్‌, రాంబాయిడ్ లుక్ లో ఉన్న టచ్‌ స్క్రీన్ ఉన్నాయి.  వెనుక సీట్ల మధ్య ప్రత్యేక క్రిస్టల్ గ్లాసెస్ కూడా ఇచ్చారు. ఇవి ఆటోమేటిక్‌ గా పైకి వచ్చే విధంగా డిజైన్ చేశారు. ప్రతి గ్లాస్‌ పై ప్రత్యేక డెకో లైన్స్ ఉండటం ఈ కారుకు మరింత ప్రీమియం టచ్ ఇస్తోంది.

ఇంజిన్ గురించి..

ఈ కాన్సెప్ట్‌ కారులో V8 ఇంజిన్ ఉపయోగించారు. ఫ్యూచరల్ లో వచ్చే ప్రొడక్షన్ మోడల్‌ లో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేక సస్పెన్షన్ సెటప్ ద్వారా మరింత కంఫర్ట్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. 7 సిరీస్ ఆధారంగా మొదటి ఆల్పినా మోడల్ 2027లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత X7 SUVకి కూడా ఆల్పినా వెర్షన్ రానుంది.

Advertisement

Read Also:  లాంచ్ కు ముందే నార్టన్ అట్లాస్ స్పై షాట్స్ లీక్.. చూడ్డానికి భలే ఉందిగా!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×