E-Paper
Advertisement

Whirlpool 3D AC: ఒక్క నిమిషంలోనే గదినిండా కూలింగ్.. 3D కూల్ టెక్నాలజీతో కొత్త స్ప్లిట్ ఏసీ లాంచ్..

Whirlpool 3D AC: ఒక్క నిమిషంలోనే గదినిండా కూలింగ్.. 3D కూల్ టెక్నాలజీతో కొత్త స్ప్లిట్ ఏసీ లాంచ్..
Advertisement

Whirlpool 3D Cool AC| వల్‌ఫూల్ ఇండియాలో కొత్త స్ప్లిట్ AC రేంజ్ లాంచ్ చేసింది. మరి కొన్ని రోజుల్లో వేసవి సీజన్ ప్రారంభం కానుండడంతో ఈ సిరీస్ ఏసీలు మార్కెట్లోకి వచ్చాయి. అడ్వాన్స్‌డ్ 3D కూల్ టెక్నాలజీతో వస్తుంది. 1 టన్, 1.5 టన్, 2 టన్, 3 టన్ మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్ లేటెస్ట్ 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తాయి. విద్యుత్ బిల్లు తక్కువగా ఉంటుంది. ఈ సిరీస్ పేరు 3D కూల్ ప్రో+ AC 2026. భారతీయ వాతావరణానికి తగినట్టు డిజైన్ చేశారు.

1 నిమిషంలో రూమ్ కూల్

వల్‌ఫూల్ ప్రకారం ఈ ACలు ఆన్ చేసిన వెంటనే రూమ్‌ను కూల్ చేస్తాయి. 1 నిమిషంలో రూమ్ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. టర్బో చిల్ మోడ్‌తో త్వరగా కూలింగ్ జరుగుతుంది. వేసవి కాలంలో రోజుల్లో త్వరగా రిలీఫ్ ఇస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే సౌకర్యంగా ఉంటుంది.

3D కూల్ టెక్నాలజీ అంటే ఏమిటి?

Advertisement

3D కూల్ టెక్నాలజీ ఇండోర్ స్పేస్ నుంచి వేడిని త్వరగా తొలగిస్తుంది. గది నలుమూలల సమానంగా కూల్ ఎయిర్ వ్యాప్తి చేస్తుంది. రూమ్‌లో హాట్ స్పాట్స్ రావు. నాలుగు దిశల స్వింగ్ సిస్టమ్ ఉంది. ప్రతి మూలకు గాలి సమానంగా చేరుతుంది. రూమ్ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది.

స్మార్ట్ సెన్సార్లు, 6th సెన్స్ టెక్నాలజీ

6th సెన్స్ పర్సనలైజ్డ్ కూలింగ్ ఫీచర్ ఉంది. వాతావరణం బట్టి కూలింగ్ స్థాయిని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. స్మార్ట్ సెన్సార్లు టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్‌ఫ్లోను మానిటర్ చేస్తాయి. మాన్యువల్ సెట్టింగ్స్ అవసరం లేకుండా కంఫర్ట్ ఇస్తుంది. ఎఫిషియెన్సీ పెరుగుతుంది.

బిల్ట్-ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్, క్లీన్ ఎయిర్

Advertisement

ACలో బిల్ట్-ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. డస్ట్, పొల్యూటెంట్స్ తొలగిస్తుంది. ఇంట్లో గాలి శుభ్రంగా ఉంటుంది. అలర్జీలు, శ్వాస సమస్యలు ఉన్నవారికి మంచిది.

Also Read: ఎయిర్ ఫ్రైయర్‌లో ఈ వంటకాలు చేయకూడదు.. అందరూ చేసే తప్పులు ఇవే

తీవ్ర ఉష్ణోగ్రతలున్నా పనిచేస్తుంది

56 డిగ్రీల సెల్సియస్ వరకు స్థిరంగా పనిచేస్తుందని వల్‌ఫూల్ చెబుతోంది. భారతీయ వేసవికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 100 శాతం కాపర్ కండెన్సర్ ఉంది. హీట్ ట్రాన్స్‌ఫర్ బెటర్‌గా ఉంటుంది. దీర్ఘకాలిక పర్‌ఫామెన్స్ మెరుగవుతుంది.

ఎనర్జీ ఎఫిషియెన్సీ, వారంటీ

5-స్టార్ రేటింగ్ వల్ల విద్యుత్ బిల్లు తక్కువగా ఉంటుంది. 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. దీర్ఘకాలిక నమ్మకం ఇస్తుంది.

6-ఇన్-1 ఎక్స్‌పాండ్ టెక్నాలజీ

6-ఇన్-1 ఎక్స్‌పాండ్ టెక్నాలజీ ఉంది. రూమ్ సైజు బట్టి కూలింగ్ లెవల్స్ సర్దుబాటు చేయవచ్చు. వివిధ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది.

ధర, అందుబాటు

సిరీస్ స్టార్టింగ్ ధర రూ.29,600. కెపాసిటీ, ఫీచర్ల బట్టి ధర మారుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తుంది. ప్రధాన ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

కొత్త AC మంచి ఆప్షన్

త్వరగా కూలింగ్, స్మార్ట్ ఆటోమేషన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉన్నాయి. తీవ్ర వేడిలో కూడా స్థిరంగా పనిచేస్తుంది. ఎనర్జీ సేవింగ్ వల్ల బిల్లు తగ్గుతుంది. ఆధునిక ఇళ్లకు సరిపోతుంది. భారతీయ వేసవికి బలమైన ఎంపికగా నిలుస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×