E-Paper
Advertisement

Subordinate Services: సబార్డినేట్ సర్వీసెస్‌లో 911 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, క్వాలిఫికేషన్ ఇదే..

Subordinate Services: సబార్డినేట్ సర్వీసెస్‌లో 911 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, క్వాలిఫికేషన్ ఇదే..
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 911 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.  ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 911

Advertisement

పోస్టుల ఖాళీల వివరాలివే..

ఈ నోటిఫికేషన్ ద్వారా లీగల్ అసిస్టెంట్ పోస్టులు 11 భర్తీ కానున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 33 అలాగే జూనియర్ ఇంజినీర్ (సివిల్) కేటగిరీలో అత్యధికంగా 281 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో 586 పోస్టులను బోర్డు భర్తీ చేస్తోంది. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి డిప్లొమా లేదా డిగ్రీ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు విద్యా అర్హతలతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రయ: ఎంపిక ప్రక్రియ పూర్తిగా రాత పరీక్ష ఆధారంగానే సాగుతుంది. ప్రతిభ చూపిన వారికి మెరిట్ ప్రాతిపదికన కొలువులు దక్కుతాయి.

దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తు ఫీజు విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీతో పాటు మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు: ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి 2026 మార్చి 25 వరకు గడువు ఇచ్చారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హత ఉన్న వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్ సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉత్తమం.

అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/

ALSO READ: Kavitha New Party: శ్రీరామనవమి రోజే ‘జాగృతి’ జెండా.. కవిత కొత్త ప్రయాణం వెనుక అసలు కథ ఇదే!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×