E-Paper
Advertisement

Jeevan Reddy: జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ.. మంత్రులతో రేవంత్ రాయభారం.. బుజ్జగింపులు ఫలించేనా?

Jeevan Reddy: జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ.. మంత్రులతో రేవంత్ రాయభారం.. బుజ్జగింపులు ఫలించేనా?
Advertisement

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్.. స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మంత్రులతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సైతం బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డితో అల్పాహారం సేవిస్తూ.. ఆయన అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీలో సముచిత స్థానం, గౌరవం తప్పకుండా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తరపున జీవన్ రెడ్డికి భరోసా ఇచ్చారు.

జీవన్ రెడ్డి.. పెద్ద దిక్కు

జీవన్ రెడ్డితో భేటి అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియా మాట్లాడారు. పార్టీ మారే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తాము కోరినట్లు చెప్పారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని.. ఆయన చర్చించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలకు జీవన్ రెడ్డి ఒక పెద్దదిక్కు అన్న శ్రీధర్ బాబు.. ఆయన గురించి తెలియని వారు రాష్ట్రంలో లేరని చెప్పుకొచ్చారు.

ఆయన బాధపడితే.. మేమూ పడినట్లే

Advertisement

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల గొంతుకగా నిలిచిన నేత జీవన్ రెడ్డి అని శ్రీధర్ బాబు కొనియాడారు. జీవన్ రెడ్డి బాధపడితే.. తాము బాధపడినట్లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు సైతం జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడిన విషయాన్ని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్బంగా మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Iran Missile Strike: విస్తరించిన యుద్ధం.. హిందూ మహా సముద్రంపైకి మిసైళ్లు.. ట్రంప్‌కు ఇరాన్ చుక్కలు!

జీవన్ రెడ్డి అసంతృప్తికి కారణమేంటి?

Advertisement

జీవన్ రెడ్డి అసంతృప్తి విషయానికి వస్తే.. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోచేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో ఆయనకు అస్సలు పడటం లేదు. నియోజకవర్గ పార్టీ వ్యవహారాలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో సంజయ్ మాటలకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల జగిత్యాల మేయర్ పీఠాన్ని తాను చెప్పిన వారికి కాకుండా సంజయ్ బలపరిచిన వ్యక్తికి కేటాయించడంతో ఆయనలోని అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో మార్చి 25న ఆయన పార్టీ మారేందుకు ముహోర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మెుదలయ్యాయి. ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. మరి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Huzurabad Politics: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×