E-Paper
Advertisement

వాట్సప్ బోర్ కొట్టిందా? ఈ యాప్స్ ట్రై చేయ్ మామ.. మీ డేటా మరింత సేఫ్!

వాట్సప్ బోర్ కొట్టిందా? ఈ యాప్స్ ట్రై చేయ్ మామ.. మీ డేటా మరింత సేఫ్!
Advertisement

WhatsApp Alternatives: ప్రస్తుతం వాట్సప్ లేని ఫోన్ ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాట్సప్ అత్యంత ప్రజాధరణ పొందినప్పటికీ.. డేటా గోప్యత, భద్రత విషయంలో యూజర్లు ఎప్పుడూ కాస్తంత ఆందోళనగానే ఉంటారు. ఈ నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయ యాప్ కోసం అన్వేషిస్తుంటారు. కాబట్టి వాట్సప్ కు పోటీగా ఉన్న అత్యంత సురక్షితమైన టాప్ – 5 ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (End-to-End Encrypted) యాప్స్ ఏవో ఈ కథనంలో పరిశీలిద్దాం.

సిగ్నల్ (Signal)

యూజర్ల భద్రత విషయంలో ‘సిగ్నల్’ యాప్.. ‘గోల్డ్ స్టాండర్డ్’గా పేరు సంపాదించింది. ఇందులో ప్రతి మెసేజ్, కాల్, గ్రూప్ చాట్ డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ (Non-profit) ద్వారా నడుస్తోంది కాబట్టి మీ డేటాను ప్రకటనల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉండదు.

త్రీమా (Threema)

Advertisement

మీ ఫోన్ నంబర్ఈ, మెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. అన్ని రకాల కమ్యూనికేషన్లు ఇందులో ఆటోమేటిక్ గా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన యాప్ కాగా.. రిజిస్ట్రేషన్ సమయంలో మీ వ్యక్తిగత వివరాలను సైతం అస్సలు అడగదు. ఒక రాండమ్ ఐడీని మాత్రమే కేటాయిస్తుంది. అయితే ఇది వాట్సప్ తరహాలో ఫ్రీ యాప్ కాదు. దీనిని ఉపయోగించడానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

సెషన్ (Session)

అత్యంత గోప్యత కోరుకునేవారికి ఈ సెషన్ యాప్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇది సెంట్రలైజ్డ్ సర్వర్లకు బదులుగా డీసెంట్రలైజ్డ్ నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ ఏమాత్రం అడగదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎప్పుడు మాట్లాడుతున్నారు? అనే మెటాడేటా (Metadata) వివరాలను కూడా ఇది ఏమాత్రం సేకరించదు. స్క్రీన్‌షాట్‌లను బ్లాక్ చేయడం వంటి భద్రతా ఫీచర్లను సైతం ఈ యాప్ కలిగి ఉంది.

లిమెంట్ (Element)

Advertisement

ఇది ఓపెన్ సోర్స్, డీసెంట్రలైజ్డ్ మెసెంజర్ ఫ్లాట్ ఫామ్. వినియోగదారులు తమ స్వంత సర్వర్‌లను ఏర్పాటు చేసుకుని దీనిని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మీ డేటా మీ నియంత్రణలోనే ఉంటుంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేస్తుంది. సాధారణ చాటింగ్‌తో పాటు ఆఫీస్ లేదా గ్రూప్ కమ్యూనికేషన్లకు ఇది చాలా బాగుంటుంది.

Also Read: డేంజరస్ డేటింగ్ యాప్స్.. క్యూట్ అమ్మాయిలతో వల.. దొరికారో తాట తీసేస్తారు!

టెలిగ్రామ్ (Telegram)

దేశంలో వాట్సప్ కు ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే టెలిగ్రామ్‌లో సాధారణ చాట్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండవు. కాబట్టి మీరు తప్పనిసరిగా ‘Secret Chat’ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ చాట్ కు పూర్తి ఎన్‌క్రిప్షన్ లభిస్తుంది. 2GB వరకు ఫైల్స్‌ను షేర్ చేసుకోవడానికి, వేల మంది సభ్యులతో గ్రూపులు క్రియేట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Also Read: ఎల్‌పీజీ కంటే చీప్.. సూపర్‌బ్లూ ఇథనాల్ స్టవ్.. కిచెన్‌లో అద్భుతాలు చేయెుచ్చు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×