E-Paper
Advertisement

మోస్ట్ ట్రెండింగ్ మెుబైల్స్.. ఎక్కడ చూసినా వీటి గురించే టాక్.. వాటి ప్రత్యేకతలు ఇవే!

మోస్ట్ ట్రెండింగ్ మెుబైల్స్.. ఎక్కడ చూసినా వీటి గురించే టాక్.. వాటి ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Best Smartphones 2026: సాధారణంగా ప్రతీనెల కొత్త ఫోన్లు మార్కెట్ లోకి లాంచ్ అవుతూనే ఉంటాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్స్.. మెుబైల్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి.. టాప్ – 5 ట్రెండింగ్ ఫోన్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్ల గురించి పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. కాబట్టి వాటి ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రియల్‌మీ 16 5G

ఈ ఫోన్ ను రియల్ మీ తాజాగా విడుదల చేసింది. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. 7000 mAh భారీ బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ను ఇది కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇందులో 6.57 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4200 nits పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్ సిటి 6400 టర్బో ప్రాసెసర్‌పై ఇది వర్క్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా దీనికి అందించారు.

ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో

Advertisement

ఈ ఫోన్.. Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. 6.78 అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్‌, 6500 mAh బ్యాటరీ 90W వైర్డ్, 30W వైర్లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50MP నైట్ మాస్టర్ కెమెరాను సైతం ఫిక్స్ చేశారు.

వివో V70 ఎఫ్ఈ

వివో ఈ ఫోన్ ను పవర్ ఫుల్ కెమెరాతో తీసుకొచ్చింది. ఇందులో ఏకంగా 200MP ప్రైమరి కెమెరాను అందించారు. ఇది డైమెన్సిటి 7360 టర్బో ప్రాసెసర్‌తో పనిచేయనుంది. అలాగే 7000 mAh బిగ్ బ్యాటరీని, 90W ఫ్లాష్ ఛార్జ్ ఛార్జ్ సపోర్ట్ అందించారు. డిస్‌ప్లే విషయానికి వస్తే 6.83 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, IP68 రేటింగ్‌ ఇందులోని ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 15 SE 5G

Advertisement

రెడ్ మీ లాంచ్ చేసిన ఈ ఫోన్ సైతం.. పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతోంది. ఇందులో 6.77 అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే, 3200 nits పీక్ బ్రైట్‌నెస్, స్నాప్ డ్రాగెన్ 6 Gen 3 ప్రాసెసర్‌, 50MP AI డ్యూయల్ కెమెరా, 5520 mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: ఎండతో అల్లాడుతున్నారా? ఈ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. ఇక అంతా కూల్ కూల్!

ఒప్పో ఫైండ్ X9 ఆల్ట్రా

ఒప్పొ తన ప్రీమియం మోడల్ గా దీనిని తీసుకొచ్చింది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 7025 mAh భారీ బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6.59 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, IP69 రేటింగ్ కలిగిన అత్యున్నత స్థాయి వాటర్ రెసిస్టెన్స్ భద్రతను ఈ ఫోన్ కు అందించారు.

Also Read: భోజన ప్లేట్లు గుండ్రంగానే ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక మిస్టరీ ఇదే!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×