ఉదయం నిద్ర నుంచి లేవగానే కొన్ని మంచి పనులు చేయాలి. మనం ఉదయాన్నే చేసే పనులు ఆ రోజు ఎలా సాగుతుందో నిర్ణయిస్తుంది. చాలా మంది లేవగానే తెలియకుండానే కొన్ని అలవాట్లు పాటిస్తుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న చిన్న తప్పులే మన జీవితంపై పెద్ద ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే చేసే ఐదు అలవాట్లు మన విజయాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నమ్మకం ఉంది. అందుకే ఈ అలవాట్లను మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
అద్దం చూడొద్దు
నిద్ర లేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడకూడదని వాస్తు చెబుతుంది. నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలో కొంత నెగటివ్ ఎనర్జీ ఉండవచ్చని, అదే అద్దంలో ప్రతిబింబం ద్వారా తిరిగి మనపై ప్రభావం చూపుతుందని నమ్మకం. దీంతో రోజంతా అలసట, అసహనం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల ఉదయం లేవగానే అద్దం చూసే అలవాటు ఉంటే దాన్ని తగ్గించడం మంచిది.
గది శుభ్రత
గది పరిశుభ్రతను పట్టించుకోవాలి. ఉదయం లేవగానే గది అస్తవ్యస్తంగా కనిపిస్తే అది మన మూడ్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. చుట్టూ చెత్తగా ఉండటం వల్ల మనసులో నెగటివ్ ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. అందుకే పడకను సర్దుకోవడం, గదిని శుభ్రంగా ఉంచడం వంటి చిన్న అలవాట్లు మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.
Also read: Hair Fall: మీకు ఈ 5 విటమిన్లు లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త
వీటిని చూడకూడదు
నిద్రలేచిన వెంటనే పాడైన వస్తువులు లేదా ఆగిపోయిన గడియారం వంటి వాటిని ఉదయం చూడటం మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మన జీవితంలో నిలకడ లేకపోవడం లేదా అభివృద్ధి ఆగిపోవడం అనే సంకేతాలుగా భావిస్తారు. అందువల్ల ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచకుండా చూసుకోవడం లేదా వెంటనే సరిచేయించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ చూడొద్దు
నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూడడం. చాలా మందికి ఇది అలవాటుగా మారింది. కానీ ఉదయం లేవగానే న్యూస్, సోషల్ మీడియా లేదా టెన్షన్ కలిగించే విషయాలు చూస్తే మన మెదడు వెంటనే ఒత్తిడికి లోనవుతుంది. దీంతో రోజంతా స్ట్రెస్, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లేవగానే మొబైల్ చూడకుండా కొద్దిసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.
Also read: Beauty Juices: వేసవిలో ఈ జ్యూసులు రోజూ తాగారంటే చర్మం మెరిసిపోతుంది
ఉదయం గది శుభ్రం చేయకుండా అలాగే వదిలేయడం. ఇది అలసత్వానికి సంకేతంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రోజును శుభ్రతతో ప్రారంభిస్తే మనలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే పనులు కూడా సజావుగా సాగుతాయి. ఉదయం చేసే చిన్న మార్పులే మన జీవితాన్ని పెద్దగా మార్చగలవని నిపుణులు చెబుతున్నారు. లేవగానే చేతులను చూసి దేవుడిని స్మరించడం, ఒక గ్లాస్ నీరు తాగడం, సూర్యకాంతిలో కొద్దిసేపు గడపడం వంటి మంచి అలవాట్లు మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి.