E-Paper
Advertisement

Gas Saving Tips: గ్యాస్‌ను ఆదా చేసే.. టాప్-5 వంటకాలు.. రుచికి రుచి ఆదాకి ఆదా!

Gas Saving Tips: గ్యాస్‌ను ఆదా చేసే.. టాప్-5 వంటకాలు.. రుచికి రుచి ఆదాకి ఆదా!
Advertisement

Gas Saving Tips: ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసిన 20-30 రోజులకు సిలిండర్ డెలివరీ జరుగుతుండటంతో అప్పటివరకూ ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తక్కువ గ్యాస్ వినియోగంతో రుచికరమైన ఆహారాన్ని వండుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. అటువంటి వారికోసం ప్రెషర్ కుక్కర్ లో త్వరగా అయిపోయే టాప్ – 5 వంటకాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఈ వంటకాలు చాలా రుచిగా ఉండటంతో పాటు.. మీ గ్యాస్ ను సైతం ఆదా చేస్తాయి. ఇంతకీ ఆ డిషెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెజిటబుల్ బిర్యానీ లేదా పులావ్

బియ్యం, కూరగాయలు, మసాలాలను కలిపి నేరుగా కుక్కర్‌లో దీనిని వండవచ్చు. కేవలం 2 లేదా 3 విజిల్స్‌లో ఆహారం సిద్ధమైపోతుంది విడిగా గిన్నెల్లో వండటం కంటే ఇది చాలా తక్కువ గ్యాస్‌ను తీసుకుంటుంది.

పప్పు లేదా సాంబారు

Advertisement

కుక్కర్ లో పప్పు లేదా సాంబార్ ను అత్యంత వేగంగా తక్కువ గ్యాస్ ను ఉపయోగించి వండుకోవచ్చు. కందిపప్పు లేదా పెసరపప్పు కుక్కర్ లో వేస్తే చాలా త్వరగా ఉడుకుతుంది. పప్పుతో పాటే కూరగాయ ముక్కలను కూడా అందులో వేసి ఉడికించడం వల్ల సమయంతో పాటు గ్యాస్ కూడా అదా అయ్యి.. నిమిషాల వ్యవధిలోనే కూర రెడీ అయిపోతుంది.

చికెన్/మటన్ కర్రీ

సాధారణంగా మాంసాహారం చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఇతర వంటకాలతో పోలిస్తే 2 లేదా 3 రెట్లు గ్యాస్ దీనికి ఖర్చు అవుతుంది. అదే చికెన్ లేదా మటన్ కర్రీని కుక్కర్ లో వండటం వల్ల గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు. ఇతర గిన్నెల్లో కంటే కుక్కర్ లో అయితే 15-20 నిమిషాల్లోనే మాంసం మెత్తగా ఉడుకుతుంది. మీ అభిరుచికి తగ్గట్లు చికెన్ లేదా మటన్ కర్రీకి అవసరమైన పదార్థాలు కుక్కర్ లో వేసేస్తే రుచికరమైన ఆహారం మీకోసం సిద్ధమైపోతుంది.

ఆలూ కుర్మా లేదా బంగాళదుంప కూర

Advertisement

సాధారణంగా ఆలూ కర్రీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అన్నంతో పాటు రోటీ, చపాతీల్లోకి సైతం ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే బంగాళదుంపలను విడిగా ఉడికించి మళ్లీ కూర వండకుండా నేరుగా కుక్కర్‌లోనే తాలింపు వేసి ఉడికించడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.

Also Read: iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. త్వరపడండి

స్వీట్ పొంగల్ లేదా పరమాన్నం

ప్రస్తుతం పండుగ సీజన్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేవుడికి నైవేథ్యంగా పొంగలి లేదా పరమాన్నం వండుతుంటారు. అయితే దీనిని గిన్నెల్లో కాకుండా కుక్కర్ లో చేయడం ద్వారా గ్యాస్ ను కొద్దిమేర సేవ్ చేయవచ్చు. బియ్యం, పప్పును కలిపి కుక్కర్‌లో మెత్తగా ఉడికించి ఆ తర్వాత బెల్లం కలపడం ద్వారా తక్కువ మంటపై త్వరగా తీపి వంటకాలను తయారు చేసేందుకు వీలు కలుగుతుంది.

Also Read: Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×