E-Paper
Advertisement

Vistadome Train Experience: ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!

Vistadome Train Experience: ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!
Advertisement

Vistadome Train Experience:  దేశంలో ఎన్నో అద్భుతమైన రైలు ప్రయాణాలు ఉన్నాయి. దట్టమైన అడవుల గుండా వెళ్లే ప్రయాణాలు కొన్ని అయితే, ఎడారుల మీదుగా వెళ్లే ప్రయాణాలు మరికొన్ని.. ఇప్పుడు మరో అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. అదే, అందమైన పశ్చిమ కనుమల గుండా  ప్రయాణించే, 180-డిగ్రీల వ్యూ అందించే విస్టాడోమ్ రైలు ప్రయాణం. ఇంతకీ ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుంది? ఖర్చు ఎంత అవుతుంది? టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

విస్టాడోమ్ రైలు గురించి..

ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన రాధిక నోమ్లర్స్ ఈ విస్టాడోమ్ రైలు ప్రయాణం గురించి ఓ వీడియో షేర్ చేసింది. ముంబై నుంచి లోనావాలాకు విస్టాడోమ్ రైలులో ప్రయాణించింది. ఈ ప్రయాణానికి ఆమె రూ. 700తో టిక్కెట్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ రైలులో చక్కటి చైర్లు, పారదర్శకమైన గ్లాస్ రూఫ్,  పరిశుభ్రమైన కోచ్‌లు, ప్రకృతి అందాలను చూసేందుకు  పెద్ద కిటికీలు, క్యాటరింగ్ సర్వీస్, వైఫై లాంటి సౌకర్యాలు ఉన్నట్లు వెల్లడించారు. విస్టాడోమ్ ప్రయాణికులు ముంబై-గోవా మార్గంలో లోయలు, నదులు, జలపాతాల అద్భుతమైన దృశ్యాలను, ముంబై-పూణే మార్గంలో పశ్చిమ కనుమల అందాలను చూసే అవకాశం ఉందని వివరించింది.

Advertisement

విస్టాడోమ్‌ రైలులో విలాసవంతమైన అనుభవం గురించి రాధిక బోలెడు విషయాలు వెల్లడించారు. 180 డిగ్రీలు తిరిగే కుర్చీలున్న రైలులో ముంబై నుంచి లోనావాలాకు ప్రయాణిస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. పశ్చిమ కనుమల విశాల దృశ్యాలు ఎంతో అందంగా ఆకట్టుకుంటాయి. కేవలం రూ. 700తో ఈ ప్రయాణం చెయ్యొచ్చు. స్మార్ట్ టచ్‌ తో తెరుచుకునే ఆటోమేటిక్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, కావాల్సినంద లెగ్‌ రూమ్ ఆకట్టుకుంటాయి.  అంతేకాకుండా, ప్రయాణికులకు రైలులో వై ఫై, సీసీటీవీ, క్యాటరింగ్ సేవలు, లగేజీని పెట్టుకునేందుకు ఒక ప్రత్యేక విభాగం కూడా అందుబాటులో ఉంది” అరి ఆమె వివరించారు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వెల్లడించింది. ఇందులో ఒక అబ్జర్వేషన్ లాంజ్ కూడా ఉన్నట్లు వివరించారు.

విస్టాడోమ్ లో ఏ ప్రాంతాలు చూడవచ్చు?  

Advertisement

⦿ పశ్చిమ, కొంకణ్ ప్రాంతం: ముంబై-మడ్గావ్ జన శతాబ్ది, ముంబై-పూణే దక్కన్ క్వీన్, ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్, యశ్వంత్‌ పూర్-మంగళూరు ఎక్స్‌ ప్రెస్, మంగళూరు-బెంగళూరు ఎక్స్‌ ప్రెస్,  యశ్వంత్‌ పూర్-కార్వార్ ఎక్స్‌ ప్రెస్ లో ఈ కోచ్ లు ఉన్నాయి.

⦿ తూర్పు, ఈశాన్య భారతం: న్యూ జల్పైగురి-అలీపుర్‌దువార్, గౌహతి-బదర్‌ పూర్, టిన్సుకియా-నహర్‌ లగన్, జల్పైగురి-డార్జిలింగ్ టాయ్ ట్రైన్, న్యూ హాఫ్లాంగ్ స్పెషల్ లో ఈ సౌకర్యం ఉంది.

⦿  హిల్, హెరిటేజ్ రైలు మార్గాలు: కల్కా-సిమ్లా, అరకు-విశాఖపట్నం, మథేరన్ హిల్ రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వేలోనూ ఈ కోచ్ లు ఉంటాయి

⦿ ఇతర మార్గాలు: అహ్మదాబాద్-కేవడియా, విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ ప్రెస్, బుద్గామ్-బనిహాల్ లోనూ ఈ కోచ్ లు ఉంటాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కటార్నియాఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని దుధ్వా టైగర్ రిజర్వ్‌ కు కలుపుతూ, మొట్టమొదటిసారిగా విస్టాడోమ్ కోచ్ సర్వీసును ప్రవేశపెట్టింది.

టికెట్ బుకింగ్ ఎలా? 

RCTC వెబ్‌ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ విస్టాడోమ్, విస్టాడోమ్ నాన్-AC లాంటి కోచ్ రకాలు ఉన్నాయి.

Read Alos:  ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఇక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×